E-Paper
Advertisement

Businessman Re release: మహేష్ బాబు  బిజినెస్ మాన్ రీ రిలీజ్.. థియేటర్ వద్ద ఉద్రిక్తత!

Businessman Re release: మహేష్ బాబు  బిజినెస్ మాన్ రీ రిలీజ్.. థియేటర్ వద్ద ఉద్రిక్తత!
Advertisement

Businessman Re release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన సినిమాలలో బిజినెస్ మెన్ (Businessman) సినిమా ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2012 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 29వ తేదీ ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.

థియేటర్ వద్ద చెలరేగిన మంటలు..

ఈ క్రమంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా మహేష్ బాబు అభిమానులు అత్యుత్సాహం కనబరిచారు.. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు థియేటర్ వద్ద బైకులపై ఎక్సలేటర్ పెంచి రౌండ్లు వేయడం మొదలుపెట్టారు ఇలా రౌండ్లు వేస్తున్న నేపథ్యంలో అధిక వేడి కావడంతో ఒక్కసారిగా ఒక బైక్ లో మంటలు చెలరేగడంతో గందరగోళ వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒక్కసారిగా మంటలు చెడరేగడంతో స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

అభిమానుల అత్యుత్సాహం..

Advertisement

ఇలా మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో బైక్ మొత్తం పూర్తిగా దగ్ధం అయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా సలానికి చేరుకొని కేవలం అత్యుత్వహం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని యువత ఇలాంటి స్టంట్ లు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వారణాసి పనులలో బిజీగా మహేష్..

Advertisement

ఈ సినిమా 2012వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక మహేష్ బాబు ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రస్తుతం మహేష్ బాబు చిన్నప్పటి సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నుంచి మహేష్ బాబు కాస్త బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా షూటింగ్ లో బ్రేక్ దొరకడంతో మహేష్ బాబు వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో చిల్ అవుతున్నారు. త్వరలో ప్రారంభం కానున కొత్త షెడ్యూల్లో మహేష్ బాబు తిరిగి బిజీ కానున్నారు.

Also Read: The Raja saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్న రాజా సాబ్?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×