E-Paper
Advertisement

The Raja saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్న రాజా సాబ్?

The Raja saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్న రాజా సాబ్?

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ది రాజా సాబ్(The Raja Saab) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిజానికి ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ జనవరి 9, 2026వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించారు అయితే జనవరి 9వ తేదీ కూడా ఈ సినిమా విడుదల కాదు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసి పండగకు తప్పకుండా వస్తున్నాము అంటూ చిత్రబృందం వెల్లడించారు.

ఓటీటీ బిజినెస్ కూడా జరగలేదు..

ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో మరోసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా బిజినెస్ ఎక్కడ పూర్తికాలేదని ఈ సినిమా కొనుగోలు చేయడానికి బయ్యర్లు కూడా ముందుకు రాని నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విఎఫ్ఎక్స్ కు సంబంధించిన పనులు కూడా పూర్తి కాలేదని అలాగే ఓటిటి డీల్ కూడా ఇంకా పూర్తికాని నేపథ్యంలో చిత్ర బృందం కూడా సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది.

సంక్రాంతికి రాజాసాబ్ కష్టమేనా?

ఇలా ఈ సినిమా పనులు ఇంకా పూర్తికాని నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాని కొనుగోలు చేసి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదని సమాచారం. ఇటీవల ప్రభాస్ నటించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ది రాజా సాబ్ సినిమా కోసం మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా ఈ సినిమా మరోసారి వాయిదా పడుతోంది అంటూ వస్తున్న వార్తలు విన్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ సినిమా విడుదల కాబోతోందన్న ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ముందుకురాని బయ్యర్లు….

మరోవైపు చిత్ర బృందం మాత్రం ఈ సినిమా సంక్రాంతి పండుగకు రావడం పక్కా అని చెబుతున్న ఇంకా ఈ సినిమా బిజినెస్ పూర్తి కాకపోవడంతో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ పాట కూడా అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ప్రియాంక మోహన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ ముగ్గురు హీరోయిన్లు నటించిన బోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Peddi Movie: కళ్ళు చెదిరే ధరకు పెద్ది డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×