Rashmika Mandanna: సాధారణంగా సినీ సెలబ్రిటీలను కలవాలి అని, వారితో ఫోటో దిగాలని, కరచాలనం చేయాలని ఎంతో మంది అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు వారి కోసం.. వారి వెంటపడతారు. ఇప్పుడు అలాంటి శ్రమ లేకుండా ఒక పని చేస్తే చాలు.. నేనే నేరుగా మీ వద్దకు వచ్చి కలుస్తాను అని చెబుతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna). అయితే తాను వచ్చి మిమ్మల్ని కలవాలి అంటే తాను చెప్పే పని చేయాలి అని కూడా చెబుతోంది. మరి రష్మిక ఏం చెప్పబోతోంది? ఎలా చేస్తే ఆమెను కలవచ్చు? అని అభిమానులు కూడా చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
లేడీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ తో రష్మిక..
రష్మిక మందన్న.. కొన్ని రోజులుగా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఈమె అదృష్టం మారిపోయింది. ‘పుష్ప’ సినిమాతో మొదలైన ఈమె సక్సెస్ పరంపర నేడు ‘కుబేర’ తో అందరి దృష్టిని ఆకర్షించింది. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర ఇలా వరుసగా సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న ఈమె ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ కొత్త మూవీకి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేయడమే కాదు.. అభిమానులకు ఒక పరీక్ష కూడా పెట్టింది ఈ ముద్దుగుమ్మ .
పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన రష్మిక..
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక మందన్న ప్రస్తుతం అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై కొత్త సినిమా చేస్తోంది. ఇప్పుడు ఈ బ్యానర్ పై వస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ‘రష్మిక అన్ లీష్డ్’ అనే ట్యాగ్ లైన్ తో ఒక కొత్త పాత్రలో కనిపించనుంది అని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో అడవిలో అగ్నితో తగలబడుతున్న ఒక చెట్టు ముందు నిఖార్సుగా రష్మిక చేతిలో బల్లెం పట్టుకొని రౌద్రంగా నిలబడింది. ఇక వెనుక కొంతమంది టార్చ్ లైట్ వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు పోస్టర్ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక ఈ పోస్టర్ పై “హంటెడ్ , వుండెడ్, అన్ బ్రోకెన్”అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని స్పష్టం అవుతుంది.
ఇలా చేస్తే రష్మికను కలిసే అవకాశం..
ఇక ఈ పోస్టర్ ని రష్మిక షేర్ చేస్తూ..” ఇంతవరకు నన్ను ఒక ముద్దుగా నవ్వే అమ్మాయిగా మాత్రమే చూశారు. అయితే ఈసారి నాలో ఒక కొత్త కోణాన్ని చూడబోతున్నారు. ఇకపోతే ఎంతో కష్టపడి చేసిన పాత్ర ఇది. ఒకవేళ మీరు ఈ సినిమా టైటిల్ గనుక గెస్ చేయగలిగితే కచ్చితంగా నేనే మీ వద్దకు వచ్చి కలుస్తాను” అంటూ తెలిపింది. ఇక రేపు ఉదయం 10:08 గంటలకి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇకపోతే పోస్టర్ను విడుదల చేశారు. కానీ అటు దర్శకుడు, సాంకేతిక బృందం ఇలా ఈ సినిమాకు సంబంధించి ఏ విషయాలను కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.
మరి ఇంకెందుకు ఆలస్యం?
పోస్టర్ తోనే ఇప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేసింది రష్మిక. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ సినిమా టైటిల్ ఏంటో గెస్ చేసి డైరెక్ట్ గా రష్మికను కలిసే అవకాశం పట్టేయండి.
Can you guess what the title of my next could be? 😉
I don’t think anyone can actually guess.. but if at all you can guess it then i promise to come meet you.. 🐒😎 pic.twitter.com/7KPl6UyVJN— Rashmika Mandanna (@iamRashmika) June 26, 2025