Mega Blast Glimpse: వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా విశ్వంభర. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. తర్వాత ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. అందుకే సినిమాని రిలీజ్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఖచ్చితంగా మెగా అభిమానులు దీనితో సంతృప్తి పడతారు అనడంలో అతిశయోక్తి లేదు.
మెగా సంహారం – విఎఫ్ఎక్స్ అదిరింది
ఈ విశ్వంభర లో అసలు ఏం జరిగిందో ఈ రోజైనా చెబుతావా మొర అనే చిన్న పిల్ల వాయిస్ తో మొదలైన ఈ గ్లిమ్స్ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది.
ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం
ఒకటి స్వార్థం యుద్దం గా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది.
ఈ డైలాగ్స్ వాయిస్ ఓవర్ లో వస్తుండగా ప్లే అవుతున్న విజువల్స్ మైండ్ బ్లాక్ అని చెప్పాలి. ఏ అంశాలయితే ముందు వచ్చిన టీజర్ లో బాగోలేదని చెప్పారు అవే ఇప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి.
ఈ చిన్న గ్లిమ్స్ చూస్తుంటే, టోటల్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతుంది. లాస్ట్ లో మెగాస్టార్ కత్తితో చేసిన సంహారం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. విఎఫ్ఎక్స్ అదిరింది అంటూ ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది.