BigTV English

Andhra King Taluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్

Andhra King Taluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్

Andhra King Taluka: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి దర్శకులుగా ప్రూవ్ చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. అలానే షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు కూడా ఉన్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిమ్స్ ట్రెండ్ నడవకముందు షార్ట్ ఫిలిం చేశాడు రామ్ పోతినేని. తమిళ్లో చేసిన ఆ సినిమా చూసి, నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి రామ్ ను హీరోగా పెట్టి, దేవదాస్ అనే సినిమా చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది.


సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో మొదట పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. కానీ రోజుల గడుస్తున్న కొద్దీ మెల్లమెల్లగా ఈ సినిమాకి హిట్ టాక్ రావడం మొదలైంది. అక్కడితో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. రామ్ కు కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమా సక్సెస్ సాధించకపోయిన కూడా రామ్ కు మంచి పేరు తీసుకొచ్చింది.

ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ డేట్ ఫిక్స్ 


ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. అలాంటి ఒక అభిమాని గురించి ఈ సినిమాను తీశాడు మహేష్ బాబు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. భాగ్యశ్రీ ఈ సినిమాలో రామ్ సరసన నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పాటకి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పాటను రాసింది రామ్ పోతినేని. ఆ పాట విన్న తర్వాత చాలామందికి రామ్ లో ఇంత గొప్ప సాహిత్యకారుడు ఉన్నాడా అనిపించింది. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

ఒక్క హిట్ కావాలి 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ కెరీర్ లో ఒక్క హిట్ సినిమా పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన రెడ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమాలు కూడా అంతంత మాత్రమే ఆడాయి. వారియర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మళ్లీ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేదు. దాదాపు సక్సెస్ వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు రామ్ మరియు రామ్ అభిమానులు.

Also Read: Thalapathy Vijay: ప్రాణం తీసిన జెండా, విజయ్ టీవీకే పార్టీ కి ఇబ్బందులు

Related News

Tvk Mahanadu : TVK మహానాడు లో తొక్కిస‌లాట… స్పాట్ లోనే 400 మంది?

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Cine Workers Strike : సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్… నోటీసులు జారీ చేసిన లేబర్ కమిషన్

Heroine: ఆ ఎమ్మెల్యే హోటల్‌కి రమ్మంటున్నాడు.. హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు.. ఆ హీరో అప్పులు తీర్చేసిన మెగాస్టార్‌..

Big Stories

×