BigTV English

IND vs Pak : ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు జరగడంపై కేంద్రం షాకింగ్ నిర్ణయం !

IND vs Pak : ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు జరగడంపై కేంద్రం షాకింగ్ నిర్ణయం !

IND vs Pak :  ఆసియా కప్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై గత కొద్ది రోజుల నుంచి సందిగ్దంలో ఉన్న విషయం తెలిసిందే.  తాజాగా ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కు గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. పీటీఐ నివేదిక ప్రకారం.. ఖండాంత టోర్నీలో పాకిస్తాన్ తో సమరానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. చాలా దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ తో ఆడితే ఆపబోమని స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్ లు మాత్రం ఉండవు అని తేల్చి చెప్పింది. వారు తమ గడ్డపై అడుగు పెట్టడానికి కానీ.. భారత జట్టు పాకిస్తాన్ లో ఆఢటానికీ కానీ ఎట్టి పరిస్థితుల్్లో అనుమతివ్వబోమని తెలిపింది. ఇదే సందర్భంలో అంతర్జాతీయ టోర్నీలలో తటస్థ వేదికలపై పాకిస్తాన్ మ్యాచ్ లు ఆడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.


Also Read :  Wankhede Stadium : మునిగిన ముంబై.. వాంఖడే స్టేడియంలోకి భారీగా వరద.. ఈ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

భారత్ – పాక్ మ్యాచ్ కి లైన్ క్లియర్ 


ఆసియా కప్ 2025 కి సంబంధించి సెప్టెంబర్ 14న దుబాయ్ లో జరుగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కి లైన్ క్లియర్ అయినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తరువాత నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..? లేదా అనే పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఈ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతించదని ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారాలన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా భారత క్రీడా మంత్రిత్వ శాఖ టీమిండియా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆ సియా కప్ టోర్నీ సెప్టెంబర్ 09 నుంచి దుబాయ్, అబుదాబీ వేదికల్లో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు ఒకే గ్రూపులో ఉన్నాయి.

సెప్టెంబర్ 10న టీమిండియా మ్యాచ్ 

టీమిండియా సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో, సెప్టెంబర్ 19న ఒమన్ తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా జట్టును ఆగస్టు 19న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో గ్రూపు దశ మ్యాచ్ లు ముగిసిన తరువాత టాప్ 2లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సూపర్ 4 కి అర్హత సాధిస్తాయి. వీటిలో ప్రతీ జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం టాప్ 2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్ కి చేరుకుంటాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. 2023లో జరిగిన ఆసియా కప్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. ఆసియా కప్ లో భారత్ 8 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈ సారి ఆసియా కప్ లో ఎవ్వరూ ఛాంపియన్ గా నిలుస్తారో వేచి చూడాలి మరీ.

Related News

MS Dhoni: రోహిత్‌, కోహ్లీని గెంటేశారు..కానీ ధోనిని ఎవ‌డు కూడా ట‌చ్ చేయ‌లేదు..కార‌ణం ఇదే

World Cup 2027: రోహిత్, కోహ్లీ ప్రపంచ కప్ 2027 ఆడాలంటే..ఈ రూల్స్ పాటించాల్సిందే !

Tazmin Brits: ఒకే ఏడాది 5 సెంచరీల‌తో రికార్డు…రాముడి అవ‌తారం ఎత్తిన సౌతాఫ్రికా లేడీ..అచ్చం కోహ్లీ లాగే

MS Dhoni: ఇంటికి వెళ్లి నీ తండ్రిలాగే ఆటో న‌డుపుకో.. సిరాజ్ పై ధోని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

Shahid Afridi: క్రికెట్ వ‌దిలేసి, కిచెన్ లో వంట‌లు చేసుకోండి..మ‌హిళ‌ల జ‌ట్టును అవ‌మానించిన‌ అఫ్రిది

Pakistan Players: రిజ్వాన్ ఇంట పెళ్లి సందడి.. త‌మ‌న్నా పాట‌ల‌కు స్టెప్పులేసిన‌ పాక్ ప్లేయ‌ర్లు

India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

Kranti Goud: మ‌గాడిలా ఉందంటూ ట్రోలింగ్‌..కానీ పాకిస్థాన్ పై బుమ్రాలా రెచ్చిపోయింది

Big Stories

×