Vijayawada Loan Scam: విజయవాడలో వెలుగులోకి మరో చిట్టీ మోసం వెలుగు చూసింది. చంద్రలేఖ అనే మహిళ కోటి రూపాయల వరకు మోసానికి పాల్పడింది. అమాయకులను టార్గెట్ చేస్తూ.. సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నా లోన్లు ఇప్పిస్తామంటూ వల వేసింది. చంద్రలేఖ మాటలను నిజమని నమ్మిన జనం, వేళల్లో మోసపోవడంతో లబోదిబో మంటూ భవానీపురం పోలీసులను ఆశ్రయించారు.
జరిగింది ఇదీ..
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామంలో చంద్రలేఖ నివాసం. తాను ధనలక్ష్మి ఫైనాన్స్ బ్యాంక్‌లో పనిచేస్తుంది. అయితే అక్కడకు వచ్చేవాళ్లను సిబిల్ స్కోర్ తక్కువగా వున్నా ఫర్వాలేదు లోన్లు ఇప్పిస్తామంటూ నమ్మించింది. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నందున మీకు డబ్బులు ఇవ్వాలంటే ముందుగా బ్యాంక్‌కు కొంత డబ్బులు ఇవ్వాలని నమ్మించింది. అలా గొల్లపూడిలో 50 మంది దగ్గర డబ్బులు వసూలు చేసింది. వీరే కాదు మొత్తం బాధితులు సుమారు 2వేళ మంది ఉన్నట్లు సమాచారం. చంద్రలేఖ మాటలను నిజమని నమ్మిన జనం ఆమెకు డబ్బులు ఇచ్చారు. అలా వేళల్లో కాదు ఏకంగా కోటి రూపాయల వరకు వసూలు చేసింది. కానీ నెలలు దాటుతున్న లోన్ విషయంపై చంద్రలేఖ స్పందించకపోవడంతో బాధితులు ఆమెను నిలదీశారు. దీనిపై చంద్రలేఖ దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఆశ్రయించారు.
Also Read: Health Benefits: ఈ ఒక్క చపాతీ తింటే చాటు.. ఆ సమస్యలన్నీ మాయం
బాధితులు మాట్లాడుతూ..
చంద్రలేఖ చేస్తున్న మోసానికి ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చినా ఇప్పటి వరకు పోలీస్టేషన్ కు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం వచ్చిన వారి వద్ద ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చి రెండు రోజులు అయ్యింది. ఇప్పటి వరకు చంద్రలేఖ ఆచూకీ లేదని మండిపడుతున్నారు. ప్రతి ఒక్కొక్కరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ కు సంబంధించిన బ్లాంక్ చెక్కును ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. మాకు మోసం చేసి ఇప్పటి వరకు కనిపించకుండా పోయిందని వాపోయారు. పోలీసులు చంద్రలేఖ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.