Thalapathy Vijay : చాలామంది ఒకవైపు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ రాజకీయాల్లో నిలబడటం అనేది మామూలు విషయం కాదు. చాలా ఓర్పు సహనం ఉండాలి. దాదాపు 10 ఏళ్ల పాటు ఎటువంటి పదవి లేకుండా నిలబడ్డాడు కాబట్టే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలానే జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అవ్వడానికంటే ముందు ఒక పెద్ద యుద్ధమే చేశాడు.
పదవులనేవి అంత ఈజీగా ఎవరికి దొరకవు. ఒకవేళ దొరికిన స్థిరంగా ఉండవు. దానిని నిలబెట్టుకోవడానికి ఎత్తులు మీద ఎత్తులు వేస్తూ ఉండాలి. అలానే మన మీద వేసిన ఎత్తులను కూడా గమనిస్తుండాలి. ఇక ప్రస్తుతం తమిళ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. విజయ్ ఎంట్రీ తో తమిళ రాజకీయాల రూపురేఖలు మారాయి. ప్రస్తుతం విజయ్ సభకు బీభత్సమైన జనాలు వస్తున్నారు.
వి ఎఫ్ ఎక్స్ లేదు, సిజి లేదు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అందరూ గమనించి ఉంటారు. గమనించక పోయినా కూడా ఆ రాజకీయా అంశాల మీద విపరీతంగా సినిమాలు రావడంతో చాలామందికి ఇంకా బాగా తెలిసింది. ఎలక్షన్ల ముందు కొందరికి ఉత్కంఠ ఉంటే ఇంకొందరికి ఎంటర్టైన్మెంట్. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని ట్రోల్ చేయడం సహజం. అయితే ఒక నాయకుడు సభకి చాలా తక్కువ మంది జనాలు వచ్చారని తర్వాత గ్రీన్ మ్యాట్ వలన విఎఫ్ఎక్స్ తో జనాలను మేనేజ్ చేశారని కొన్ని పోస్టులు కనిపించేవి. కానీ ఇప్పుడు విజయ్ కు సంబంధించిన సభలో అలాంటివేమీ లేవు. భారీగా జనం విజయ్ సభలకు హాజరవుతున్నారు. ఇప్పుడు జనాభాను చూస్తుంటే ఏ నాయకుడు సభకు ఆ రేంజ్ జనాలు రాలేదు అని చెప్పొచ్చు.
గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా.?
ఇకపోతే విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాల్లో నిలబడాలంటే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే సరిపోదు. మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలో సభ పెట్టినప్పుడు చాలామంది జనాలు వచ్చారు. అలానే పవన్ కళ్యాణ్ సభలకు కూడా జనాలు వచ్చారు. ఒక సందర్భంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… మీరు ట్వీట్లు వేస్తారు కానీ ఓట్లు వేయరు అంటూ మాట్లాడారు. అలా సభలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటేస్తారు అనుకోవడం భ్రమ. సినిమా ఇమేజ్ ఉంది కాబట్టి చూడడానికి కూడా వస్తారు. ఆంధ్ర రాష్ట్రంలోనే పవనన్న కు ప్రాణమిస్తాం జగనన్నకు ఓటేస్తాం అన్న యువత చాలామంది ఉన్నారు. మరి తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడి విజయ్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడేమో వేచి చూడాలి.
Also Read: Andhra King Thaluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్