Cine Workers Strike : సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్… నోటీసులు జారీ చేసిన లేబర్ కమిషన్
గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా కార్మికులకు నిర్మాతలకు మధ్య ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా కార్మికులకు తమ వేతనాలు 30 శాతం వరకు పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇవ్వాల్సిందని కంటే ఎక్కువ ఇస్తున్నాము మళ్లీ 30% పెంచమని అడుగుతున్నారు అనేది నిర్మాతలు వాదన.
అయితే 30% వేతనాలు పెంచినంత వరకు కూడా షూటింగుకు రాము అని కంప్లీట్ గా ఆపేశారు సినీ కార్మికులు. ప్రస్తుతం హైదరాబాదులో అసలు షూటింగులు జరగడం లేదు. కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. అవి ఇప్పుడు వస్తాయో రావో తెలియని పరిస్థితి. అయితే ఈ ఇష్యూ ఒక కొలిక్కి వస్తుంది అనుకునే టైంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఈ ట్విస్ట్ తో యూనియన్ నాయకులు షాక్ అవుతున్నారు.
సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్
మెంబర్ షిప్ ఎంత తీసుకుంటున్నారు.? చందాలు ఎంత తీసుకుంటున్నారు.? బ్యాంకు బ్యాలెన్స్ లు ఎంత.? వివరాలతో పాటు ఆడిట్ రిపోర్ట్స్, మినిట్స్ బుక్స్ తీసుకొని మూడు రోజులలో హాజరు కావాలని యూనియన్ నాయకులకు నోటీసులు పంపిన జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్. ఈ ట్విస్ట్ తో ప్రస్తుతం యూనియన్ లీడర్లు అంతా కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే యూనియన్ నాయకులు ప్రతిసారి తమ కష్టాలు చెబుతూ వచ్చారు. మరోవైపు నిర్మాతలు కూడా అసలు యూనియన్ కి ఎందుకు డబ్బులు కట్టాలి. లక్షల లక్షలు కట్టి నిజమైన టాలెంట్ ఉన్నవాడు ఇక్కడ పని చేయలేకపోతున్నాడు అంటూ చాలామంది నిర్మాతలు చెబుతూ వచ్చారు.
యూనియన్ కు డబ్బులు ఎందుకు కట్టాలి.?
రీసెంట్ గా ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..ప్రస్తుతం సినిమా కార్మికులకు వేతనాలు ఎక్కువగానే ఇస్తున్నాము. మళ్లీ వాళ్ళు 30% పెంచమని అడగడం కరెక్ట్ కాదు. ఒకవేళ పెంచినా కూడా అవి వర్కర్లకు వెళ్ళవు. యూనియన్ కి వెళ్ళిపోతాయి. అసలు యూనియన్ ఎందుకు ఉండాలి. డాన్సర్ గా చేరాలి అంటే ఏడు లక్షలు కట్టాలి. ఫైటర్ గా చేరాలంటే దాదాపు 5 లక్షల కట్టాలి. ప్రొడక్షన్ బాయ్ గా చేరాలన్న మూడు లక్షల కట్టాలి. అసలు ఈ డబ్బులన్నీ యూనియన్ కు ఎందుకు కట్టాలి అని ప్రశ్నించారు. బహుశా ఇది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కి అర్థమై ఉంటుంది. అందుకే ఉన్నపలంగా యూనియన్ లీడర్ల బ్యాంక్ అకౌంట్ చెక్ చేసే పనిలో పడ్డారు.
Also Read: Andhra King Thaluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్