Bull Calf Lives On 28th Floor: సాధారణంగా అపార్ట్ మెంట్లలో నివాసం ఉండే వాళ్లు, కుక్కలను, పిల్లలను మరికొంత మంది కుందేళ్లను కూడా పెంచుకుంటారు. అయితే, చెన్నైలోని ఓ కుటుంబం ఏకంగా 28వ అంతస్తులో ఓ ఆవు దూడను పెంచుకుంటున్నారు. దానికి అకెల్స్ అని పెట్టుకున్నారు. నెల వయసు ఉన్న గాడపడిన దూర ఆర్కిటెక్చరల్ డిజైనర్ తేజస్విని ఎస్ రంగన్ కు కనిపించింది. దానిని ఆమె రక్షించారు. ఆ తర్వాత ఇంటికి తెచ్చి దానిని పెంచుకుంటున్నారు.తాజాగా ఈ దూడకు సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ దూడను పెంచుకుంటున్న తేజస్విని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అపార్ట్ మెంట్ లో ఆవు దూడ
ఆగష్టు 8న సాయి విఘ్నేష్ అనే కంటెంట్ క్రియేటర్ ఈ దూడకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.”అలెక్స్! అపార్ట్ మెంట్ లో నివసించే దూడ!” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేశారు. తేజస్విని ఆ దూడ గురించి పలు విషయాలను వెల్లడించారు. అలెక్స్ ను ఇంట్లో వాళ్లంతా ఎంతో ఇష్టపడుతారని చెప్పారు. ఆ దూడ బాల్కనీలో పడుకుని పరిసరాల్లో ఉన్న బంగాళాఖాతం, బకింగ్ హామ్ కాలువ దృశ్యాలను చూసి ఎంజాయ్ చేస్తుందన్నారు. దానితో పాటు ఇంట్లోని కుక్క కూడా ఒకేసారి ఫుడ్ తీసుకుంటాయని చెప్పారు. కుక్క, ఆవు దూడ కలిసి నేపియర్ గడ్డి తింటాయని వివరించారు. కుక్క, దూడ ఇంట్లో కలిసిపోయి ఎంజాయ్ చేస్తాయన్నారు.
తేజస్వినిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఇక అపార్ట్ మెంట్ లో ఆవుదూడను పెంచుకుంటున్న తేజస్వినిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గాయపడిన ఆవు దూడను తెచ్చి పెంచుకోవడం ఆమె మంచి మనస్సుకు నిదర్శనం అంటున్నారు. అలెక్స్ ను ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. “మిస్టర్ అలెక్స్ చాలా అందమైన వ్యక్తి. నిజంగా ముద్దుగా ఉన్నాడు. మీకు హ్యాట్స్ ఆఫ్. గొప్ప పని చేస్తున్నారు. దేవుడు ఆశీర్వదిస్తాడు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “పెంపుడు జంతువులు అంటే కుక్క, పిల్లి మాత్రమే కాదు. అందరూ ఆవు దూడలను పిల్లలుగా చూస్తారని ఇది రుజువు చేస్తుంది” అని మరొక నెటిజన్ రాసుకొచ్చాడు. “ఈ ప్రపంచంలో మీలాంటి అద్భుతమైన జంతు ప్రేమికులు ఉండటం చాలా సంతోషంగా ఉంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
అటు ఈ వీడియోను చూసి మరికొంత మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. “ఆవు దూడ పెద్దగా పకిగితే ఆ ఫ్లాట్ లో ఎలా ఉంటుంది? లిఫ్ట్ లోకి ఎలా ఎక్కుతుంది?” అని రాసుకొచ్చారు. చెన్నైలోని లగ్జరీ అపార్ట్ మెంట్లు స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, ల్యాండ్ స్కేప్డ్ గార్డెన్ లతో సహా అత్యాధునిక సౌకర్యాలను అందిస్తున్నాయి. అయితే, ఖరీదైన అపార్ట్ మెంట్ లోని 28వ అంతస్తులో అలెక్స్ పెరగడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: గోల్డెన్ నర్స్ షార్క్.. ఫస్ట్ టైమ్ కనిపించింది బ్రో!