Duvvada : క్రేజీ కపుల్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. దువ్వాడ జంట రూటే సెపరేటు. ప్రపంచమంతా ఏమైనా అయిపోనీ. రాజకీయాలు ఎలాగైనా ఉండని. అనుకునే వాళ్లు ఏమైనా అనుకోని. తిట్టుకునే వాళ్లు ఏమైనా తిట్టుకోని. వీ డోంట్ కేర్. మేమింతే.. అన్నట్టు ఉంటారు వారిద్దరూ. అందుకే, దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల జంట.. టాక్ ఆఫ్ ది టూ తెలుగు స్టేట్స్.
లేట్ వయస్సులో లేటెస్ట్‌గా..
అతని ఏజ్ 60కి దగ్గర్లో ఉంది. ఆమేమో జస్ట్ 40 ఛేంజ్. ఇద్దరి మధ్య బాగా ఏజ్ గ్యాప్ ఉన్నా.. కొత్త జంటలా కలిసుంటారు. లేటెస్ట్‌గా పెళ్లి రోజు వేడుకులు కూడా జరుపుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ యాదవ్ ఆ జంటకు బంతిపూల దండేసి.. వారితో కేక్ కట్ చేయించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దువ్వాడ కపుల్స్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్లు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు. పాత వీడియోను కొత్తగా వైరల్ చేస్తున్నారు. దువ్వాడ అనగానే అటోమెటిక్‌గా ట్రెండింగ్ అవుతోంది. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. వారికి ఇప్పటికీ అఫీషియల్‌గా పెళ్లి కాలేదు. అన్‌అఫీషియల్‌గా చేసుకున్నామని చెబుతున్నారు. రెండేళ్లుగా ఇద్దరూ కలిసి ఉంటున్నారు. లివింగ్ టుగెదర్, డేటింగ్ ఇలా ఎవరేమనుకున్నా.. తాము మాత్రం భార్యభర్తలమేనని అంటున్నారు వాళ్లు. భార్య వాణితో కోర్టు కేసులు ముగిశాక.. అధికారికంగా మరోసారి పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. అప్పటి వరకూ దొంగపెళ్లితో దొరలాంటి జీవితమే.
రీల్స్ రచ్చ..
ఇక, తిరుమలలో మాధురి చేసి రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్రని లంగాఓణీలో.. లేడి పిల్లలా గెంతులేస్తూ.. హోయలు పోయింది. మాధురి రీల్స్‌పై కాంట్రవర్సీతో పాటు ఆమె అందానికి కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. మేడమ్ స్లిమ్ అయినట్టు ఉంది.. మేడమ్ సార్ మేడమ్ అంతే అంటూ దువ్వాడ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఆ రీల్స్ ఎపిసోడ్‌కు కంటిన్యూగా ఇప్పుడు మ్యారేజ్ డే కేక్ కటింగ్ వీడియో మీడియాలో హంగామా చేస్తోంది. బంతిపూల మాలలో.. మాధురి, శ్రీనుల ఛరిష్మా మామూలుగా లేదుగా అంటున్నారు.
పార్టీ మూడ్.. జాలీ కపుల్
వాళ్లిద్దరూ అంతే. ప్రతీదీ పండగ చేసుకుంటారంతే. ఇటీవలే కూతురు హాఫ్ సారీ ఫంక్షన్‌లో వాళ్ల డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. బాలీవుడ్ సాంగ్‌కు మనోడు హీరోలా ఫీల్ అవుతూ, రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో మాధురి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంటే.. తెగ సిగ్గు పడిపోయిందామె.
ఆ ముచ్చట కూడా తీరేనా?
షష్టిపూర్తి వయస్సులో దువ్వాడ కోసం ఓ బిడ్డను కనే పనిలో ఉన్నారు దివ్వెల. ఈ విషయం పలు ఇంటర్వ్యూల్లో ఆమే స్వయంగా చెప్పారు. తనకు మగపిల్లవాడే పుడతాడని.. దువ్వాడకు వారసుడిని ఇస్తానని మాధురి ముచ్చట పడుతున్నారు. మరి, ఈ వయస్సులో ఆ ముచ్చట తీరేనా..?
దువ్వాడ తగ్గేదేలే..
భార్య వాణిని వదిలేశారు శ్రీను. పిల్లలనూ ఇంట్లో నుంచి తరిమేశారు. మాధురితో సరికొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. 58 ఏళ్ల ఏజ్‌లో దసరా బుల్లోడిలా ఎంజాయ్ చేస్తున్నారు. మాధురి అంతే మాధుర్యం పంచుతున్నారు. దువ్వాడను పూలరంగడిలా చూసుకుంటున్నారు. వీళ్ల యవ్వారం భరించలేకే అన్నట్టు.. ఇప్పటికే శ్రీనుపై వేటు వేసింది వైసీపీ. అయినా, వాళ్లు డోంట్ కేర్. రాజకీయాలు ఏమైనా కానీ.. తాము మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పార్టీలు, సరదాలు, ఇంటర్వ్యూలు, రీల్స్‌తో రెగ్యులర్‌గా న్యూస్‌లో ఉంటున్నారు.