Rini George Accuses Politicians : మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి. హేమ కమిటీ కారణంగా మాలీవుడ్ తరచూ వార్తల్లో నిలిచింది. ఈ మధ్యే ఈ వ్యవహారం సద్దుమనిగిందని అనుకునేలోపే మరో నటి లైంగిక ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఓ యువ రాజకీయ నాయకుడు కొన్నేళ్లుగా తనని వేధిస్తున్నాడంటూ ఆమె ఆరోపించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. సదరు నటి ఆ రాజకీయా నాయకుడి పేరు చెప్పలేదు.
హోటల్ గదికి రావాల్సిందే..
వివరాలు.. కేరళకు చెందిన నటి రీనీ ఆన్ జార్జ్ జాతీయ పార్టీ నాయకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. నన్ను హోటల్‌కు రమ్మంటూ కేరళకు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడు నాకు పదే పదే అభ్యంతకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నాడు. గత మూడేళ్లుగా ఇది కొనసాగుతూనే ఉంది. అతడిపై ఆ పార్టీ సీనియన్లకు కూడా ఫిర్యాదు చేశాను. అయినా కూడా ఆయనపై వారు చర్యలు తీసుకోకపోగా.. ఉన్నత పదవులు ఇస్తున్నారు. సదరు నేత నన్ను మాత్రమే కాదు.. ఇప్పటి వరకు చాలా మంది యువతులను ఇలా వేధించినట్టు నాకు తెలుసు” అంటూ రీనీ ఆవేదన వ్యక్తం చేసింది.
భవిష్యత్తులో మరే నటికి ఇలాంటి వేధింపులు రావోద్దనే తాను బయటకు వచ్చి ఈ విషయం చెబుతున్నానని కూడా పేర్కొంది. అయితే రీనీ ఎక్కడ కూడా ఆ రాజకీయా నాయకుడి పేరు ప్రస్తావించలేదు. అయితే ఆ తర్వాత రీనీ తన పోస్ట్‌ని డిలీట్ చేయడం గమనార్హం. కానీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ మాత్రం ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటథిల్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఆయనే వేధింపులకు పాల్పడుతున్నారని, మండిపడుతోంది. రాహుల్ పేరు ప్రస్తావిస్తూ.. అతడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే పదవికి రాహుల్ రాజీనామా?
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మార్చ్ నిర్వహించింది. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్ మమ్‌కూటథిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా రాహుల్ యూత్ కాం్గరెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రచయిత్రి హానీ భాస్కర్ సైతం రాహుల్ మమ్‌కూటథిల్‌పై ఆరోపణల చేశారు. తనను కూడా రాహుల్ వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించింది. తనకు సోషల్ మీడియాలో పదే పదే మెసేజ్‌లు పంపి వేధించాడని ఆమె తెలిపింది. అంతేకాదు యూత్ కాంగ్రెస్‌లో మహిళలను కూడా అతడు వేధించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీ అధిస్థానం ద్రష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది.
Also Read: Chiranjeevi: చిరంజీవి గోప్ప మనసు.. ఆ హీరో అప్పులు తీర్చేసిన మెగాస్టార్