Tvk Mahanadu : మామూలుగా చాలామంది రాజకీయ విషయాలను పట్టించుకోరు. కానీ సినిమా వాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు పాలిటిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల మీద చాలా సినిమాలు వచ్చాయి. ఒకరి సినిమాకి కౌంటర్ గా మరొక సినిమాలు తీయడం మొదలుపెట్టారు.
ఒకప్పుడు ఒక వర్గానికి కొన్ని సినిమాలు ప్లస్ పాయింట్ అయితే, ఇప్పుడు మరో వర్గానికి ఇంకొన్ని సినిమాలు ప్లస్ పాయింట్ గా మారాయి. ఏదేమైనా కూడా సినిమా రాజకీయాలు వేర్వేరు కాదు అని అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. ఇళయదళపతి విజయ్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో పరిచయమైన విజయ్, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయాడు. ఇక విజయ్ తమిళ్ వెట్రి కలగం అనే పార్టీను స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ మహానాడు సభ ఈరోజు జరుగుతుంది. ఈ సభలో అనుకోని సంఘటన జరిగింది.
TVK మహానాడు లో తొక్కిసలాట..
TVK మహానాడు కు భారీ స్థాయిలో జనాలు హాజరయ్యారు. గతంలో ఏ సినిమా వాళ్లకి, ఏ రాజకీయ నాయకులకి రాని జనం విజయ్ సభలకు వస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అంతమంది జనం వచ్చినప్పుడు తొక్కిసలాట అనేది సహజంగా జరుగుతుంది. TVK మహానాడు లో కూడా తొక్కిసలాట జరిగినట్లు సమాచారం వినిపిస్తుంది. ఏకంగా 400 మంది గాయాల పాలైనట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అనేది మరికొంతసేపట్లో తెలుస్తుంది. దీని గురించి కొంత సేపట్లో అధికారికంగా కూడా ప్రకటించనున్నారు.
ఒకరు మృతి
Tvk మహానాడు లో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఇది బాధాకరమైన విషయం. రాజకీయ నాయకులు భారీ సభలు పెడుతున్న ప్రతిసారి ఎవరో ఒకరు ప్రాణం పోతూనే ఉంటుంది. అయితే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. తమ సభల వలన ప్రాణాలు పోయినందుకు ఆయా నాయకులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి నేనున్నాను అని ధైర్యాన్ని మాత్రమే చెప్పగలరు. కానీ మనిషి లేని లోటును ఎవరు తీర్చలేరు. మొత్తానికి ఏదైతే జరగకూడదు అని ప్రతి నాయకుడు కోరుకుంటాడో, విజయ్ సభలో అదే జరిగింది. కొన్ని చావులను కూడా కొంతమంది రాజకీయం చేస్తారు అని చెప్పడంలో వింత ఏమీ లేదు. ఇప్పుడు దీనిని పట్టుకొని అధికార పార్టీలు, సంచలనమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
Also Read: Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం