BigTV English

OTT Movie: దెయ్యం బారి నుంచి కూతురిని రక్షించుకునే తల్లి కథ.. ఓటీటీకి వచ్చేస్తోన్న మైథలాజికల్‌ హారర్‌ మూవీ..

OTT Movie: దెయ్యం బారి నుంచి కూతురిని రక్షించుకునే తల్లి కథ.. ఓటీటీకి వచ్చేస్తోన్న మైథలాజికల్‌ హారర్‌ మూవీ..

MAA Movie OTT: హారర్‌, క్రైం థ్రిల్లర్‌ చిత్రాలకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటీటీలో ఈ చిత్రాలకు డిమాండ్‌ ఎక్కువ. హారర్‌, క్రైం డ్రామాలు వచ్చాయంటే ఓటీటీ ప్రియులకు పండగే. ప్రతివారం ఓటీటీలో సరికొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలా ఈ వారం ఓటీటీలో ఓ కొత్త సినిమా రాబోతోంది. అది కూడా హారర్‌, థ్రిల్లర్‌. పైగా మైథలాజికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ. ఇంతకి ఆ సినిమా ఏంటంటే.. ‘మా’. ఇటీవల హిందీలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో విడుదల కానుంది. ఇంతకి ఈ సినిమా స్ట్రీమింగ్‌, ఓటీటీ పార్ట్‌నర్‌ ఏదో చూద్దాం!


రేపటి నుంచే స్ట్రీమింగ్

బాలీవుడ్‌ నటి కాజోల్‌ ప్రధాన పాత్రలో విశాల్ పురియా దర్శకత్వంలో మైథలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. జియో స్టూడియోస్, దేవ్ గన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 27న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో కాజోల్‌ నటనకు ప్రశంసలు వచ్చాయి. కానీ, క్రిటిక్స్‌, యాంటి ఫ్యాన్స్‌ నుంచి ఈ సినిమా నెగిటివ్‌ రివ్యూస్‌ అందుకుంది. ఓ వైపు ఓ వర్గం ఆడియన్స్‌లో మాలో హారర్‌ ఎలిమెంట్స్‌ బాగున్నాయనే రివ్యూస్‌ కూడా వచ్చాయి. థియేట్రికల్‌ రన్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్‌ చేసుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ డిజిటిల్‌ ప్రీమియర్‌కు రానుండటంతో ఓటీటీ ప్రియలంత ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ నెట్‌ఫ్లిక్స్‌ అధికారక ప్రకటన ఇచ్చింది. ఆగష్టు 22న ఈ సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. అంటే ఈ రోజు అర్థరాత్రి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.


కథేంటంటే..

సింగిల్‌ మదర్‌ గా కూతురితో కలిసి ఒంటిరిగా జీవిస్తున్న మహిళ.. తన కూతురిని దెయ్యం బారి నంచి ఎలా కాపాడిందనేదే ‘మా’ కథ. హారర్‌, థ్రిల్లర్‌కు మైథాలాజికల్ టచ్ ఇచ్చాడు. అన్ని కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రంలో కాజోల్‌ అంబిక పాత్రలో కనిపించింది. ఆమె భర్త శుభంకర్‌(ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా) మరణించడం తర్వాత ఆమె జీవితం మొత్తం మారిపోతుంది. అతడి ఆసక్తి సంబంధ విషయాలు సెటిల్‌ చేసుకునేందుకు తన చిన్న కూతురు శ్వేతతో (ఖేరిన్‌ శర్మ) కలిసి చంద్రపూర్‌ అనే ఊరికి వెళ్తుంది. ఆ ఊర్లలో యువతులు అదృశ్యం వంటి సంఘటనలతో గందరగోళంగా ఉంటుంది.

చాలా ఏళ్లుగా ఆ ఊరి జనాలను అదృశ్య శక్తి గ్రామస్తులను భయపెడుతున్నట్టు కథలు ఉన్నాయి. ఊర్లో జరిగే సంఘటన గురించి అంబికకు తెలుస్తోంది. దీంతో తన కూతురిని కోసం ఆ ఊరిని వదిలి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ, అప్పటికే శ్వేతను దెయ్యం అవహిస్తుంది. దాంతో ఆ ఊరి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు వస్తాయి. శ్వేత పూర్తిగా ఆ ఆత్మకు లోంగిపోతుంది. ఈ క్రమంలో తన కూతురిని కాపాడేందుకు అంబిక ఏం చేసిందనేది మిగత కథ. తన కూతురితో పాటు ఊరిలో అదృశ్యమైన మిగత యువతులను అంబిక ఎలా కాపాడింది.. ఈ క్రమంలో అంబిక దైవం సాయం ఎలా తీసుకుంది? ఆ దెయ్యాన్ని ఎలా ఎదుర్కొనేది చెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read: Best Web Series: ఆటలు ఆడండ్రా అని పంపిస్తే.. వీరు ఆడే ఆటలేంటో తెలుసా? ఈ సీరిస్‌ను పిల్లలతో చూడొద్దు

Related News

Paradha Movie : ఆ ఓటీటీలోకి అనుపమ ‘పరదా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movie : సీక్రెట్ లవ్… ఒకడు ప్రేమిస్తే, పెళ్లి మరొకడితో… ఊహించని ట్విస్ట్ తో లైఫ్ నాశనం

OTT Movie : చచ్చిన 7 రోజుల తరువాత రీఎంట్రీ… అఘాయిత్యం చేసిన గ్యాంగ్ ను చచ్చినా వదలకుండా… బతికుండగానే నరకం

OTT Movie : పడుచు పిల్లతో పాడు పనులు… కల్లోనూ అదే యావ… మస్ట్ వాచ్ మలయాళ కాంట్రవర్సీ డ్రామా

OTT Movie : రక్తం ఏరులై పారే నది… అల్టిమేట్ యాక్షన్, ఎక్స్ట్రీమ్ వయొలెన్స్… ఈ కన్నడ మూవీ మెంటల్ మాస్ మావా

Big Stories

×