E-Paper
Advertisement

Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ పై కేస్ ఫైల్.. లైంగిక వేధింపుల కేసులో!

Manjummel Boys:  మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ పై కేస్ ఫైల్.. లైంగిక వేధింపుల కేసులో!
Advertisement

Manjummel Boys: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాలలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే వార్తల్లోకి ఎక్కేస్తోంది. ఇకపోతే వ్యక్తిగత సినిమాల కారణంగా సెలబ్రిటీలు వార్తల్లో నిలిస్తే.. మరికొంతమంది లైంగిక వేధింపుల కేసుల్లో వార్తల్లో నిలవడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రంతో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు చిదంబరం (Chidambaram) వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ పై కేసు ఫైల్..

మలయాళ సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన చిదంబరం.. ఇప్పుడు లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నాడు. చిదంబరంపై కేరళలోని ఎర్నాకులం సౌత్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మార్చి 2న ఒక మలయాళ నటి ఫిర్యాదు మేరకు ఈకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఫిర్యాదు చేసిన నటి వివరాలను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన మలయాళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారగా.. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం..

Advertisement

ఇకపోతే పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2022లో ఎర్నాకులం ప్రాంతంలో ఉన్న సినీనటి ఫ్లాట్ లో ఈ లైంగిక వేధింపులు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిదంబరం అక్రమంగా అపార్ట్మెంట్లోకి ప్రవేశించి.. లైంగిక ఉద్దేశంతో అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదుదారు మహిళ తన వాంగ్మూలంలో తెలిపింది.

పలు సెక్షన్ల కింద చిదంబరంపై కేసు ఫైల్ ..

ఇకపోతే ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. చిదంబరం పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74 (మహిళ గౌరవాన్ని అవమానించే ఉద్దేశంతో దాడి లేదా బల ప్రయోగం), సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ విచారణను5విస్తృత స్థాయిలో కొనసాగిస్తున్నారు. త్వరలోనే చిదంబరాన్ని విచారణకు పిలిచే అవకాశం ఉందని.. దర్యాప్తు ఫలితాల ఆధారంగానే అరెస్టు సహా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.

Advertisement

ALSO READ:RK Roja: అదే జోష్.. అదే స్పీడ్.. రీ ఎంట్రీలో అదరగొట్టేస్తున్న రోజా.. తెలుగులో మాత్రం కాదండోయ్!

చిదంబరం కెరియర్..

మలయాళంలో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈయన 2021లో Jan.E.Man అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం కూడా ఈయనకు విమర్శకుల ప్రశంసలు అందించింది. కానీ మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక ప్రస్తుతం తన మూడో సినిమాగా బాలన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×