E-Paper
Advertisement

RajyaSabha: తెలంగాణ రాజ్యసభ పోరు.. బీఆర్ఎస్ మైండ్ గేమ్ వెనుక అంతరార్ధం ఇదేనా?

RajyaSabha: తెలంగాణ రాజ్యసభ పోరు.. బీఆర్ఎస్ మైండ్ గేమ్ వెనుక అంతరార్ధం ఇదేనా?
Advertisement

RajyaSabha: తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉంది. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది, ఎన్నిక ఏదైనా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్యనే పోటీ కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. తాజాగా తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల వేడి రాజుకుంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా? లేదా? అనేది చర్చల్లో నలుగుతోంది

ఈసీ షెడ్యూల్ విడుదల

దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మార్చి 5 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు, మార్చి 16న పోలింగ్, అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. తెలంగాణలో ఖాళీ అవ్వబోయే రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న అభిషేక్ సింఘ్వీ , బిఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న సురేష్ రెడ్డి స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.

సడన్ నోటిఫికేషన్‌తో పార్టీల్లో కసరత్తు

Advertisement

అయితే అభిషేక్ సింఘ్వీ స్థానం కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కె.కేశవరావు రాజీనామా చేస్తే వచ్చిన స్థానమే. ప్రస్తుతం టెక్నికల్ గా బీఆర్ఎస్ నుంచిఒక స్థానం మాత్రమే ఖాళీ అవుతుంది. ప్రస్తుతం లోక్‌సభ‌లో బీఆర్ఎస్‌కి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులలో ఇప్పుడు రిటైర్ అవబోయే సురేష్ రెడ్డి ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలలో తెలంగాణ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండనున్నారు. ఆ క్రమంలో సడన్ గా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమకున్న బలాబలాలను విశ్లేషించుకుంటున్నాయి.

రెండు సీట్లకు ముగ్గురు పోటీదారులు?

తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఆయా పార్టీలకు ఉన్నబలంతోనే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఎన్నిక కాబోతున్నారు. కాంగ్రెస్ రెండు రాజ్యసభ స్థానల్లో పోటీ చేయనుంది. శానససభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్‌కు ఒక స్థానానికి పోటీ చేసే అవకాశముంది. గులాబీ పార్టీ కనుక తమ అభ్యర్ధిని బరిలోకి దింపితే.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ఇద్దరు కలిపి మొత్తం ముగ్గురు పోటీలో ఉంటారు. ముగ్గురికి పోటీ జరిగితే గెలిచే ఇద్దరిలో ఒక్కొక్కరికీ 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

బీఆర్ఎస్‌కు రాజ్యసభ సీటు దూరమే?

Advertisement

ఆ లెక్కన ప్రస్తుతం బీఆర్ఎస్ కి 27 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినా, వారు విప్ ఫాలో అయినా 37 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ కు ఉంటారు. దాంతో బీఆర్ఎస్‌కు పెద్దల సభలో ఎంపీ స్థానం దక్కే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈ నేపథ్యంలో పోటీకి కూడా దూరంగా ఉండాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఉన్న కొందరు నేతలు మాత్రం ఈ రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం ద్వారా, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం వస్తుంది కాబట్టి పోటీల్లో నిలబడాలని అభిప్రాయపడుతున్నారంట.

తగ్గేదేలే అంటున్న బీఆర్ఎస్

పార్టీ నేతల సూచనలను బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఒప్పుకోవడం లేదంట. బీఆర్ఎస్ పోటీలో ఉంటే 40 సీట్లు అధికారికంగా కావాలి కాబట్టి.. అన్ని సీట్లు లేకపోవడంతో బిఆర్ఎస్ వెనక్కు తగ్గే అవకాశం ఉంది. పోటీ చేసినా గెలవలేము కాబట్టి, మళ్లీ ఓడిపోయామని అనిపించుకోవడం కంటే అసలు పోటీలోనే లేకుండా ఉండడమే ఉత్తమం అని బీఆర్ఎస్ భావిస్తోందట, దీనితో ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేయడం లేదు అనేది కన్ఫామ్ అయిందంటున్నారు.

రాజ్యసభలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్‌కు నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఎంపీ సురేష్ రెడ్డి పదవి కాలం ముగుస్తుంది కాబట్టి, బిఆర్ఎస్ కు ఇక మిగిలింది రాజ్య సభలో ముగ్గురు ఎంపీలు మాత్రమే. మరో రెండు సంవత్సరాల తర్వాత ఇంకో ఇద్దరి పదవి కాలం కూడా ముగియనుంది. అప్పుడు కూడా బిఆర్ఎస్ కు గెలిచే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆశించే వాళ్ళు కూడా, మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:నన్ను బలిపశువును చేశారు.. కవిత సంచలన వ్యాఖ్యల వెనుక అసలు టార్గెట్ ఎవరు?

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×