Dhurandhar 3: బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలలో ధురంధర్ సినిమా ఒకటి. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ధురంధర్ సినిమా ఊపిరి పోసిందని చెప్పాలి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇలా ఈ సినిమా మొదటి భాగం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడంతో ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ధురంధర్ 2(Dhurandhar 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ విడుదలైన ఈ సినిమా సంచలనాలను సృష్టిస్తుంది.
ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమాపై ఎంతోమంది నటీనటులు దర్శక నిర్మాతలు ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఆదిత్యధర్(Aditya Dhar) డైరెక్షన్లో రణవీర్ సింగ్ (Ranveer Singh)సారా అర్జున్(Sara Arjun) జంటగా నటించిన ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు మూడో భాగం కూడా రాబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా మూడో భాగం గురించి వార్తలు రావడమే కాకుండా ఈ సినిమా ఈ ఏడాది జూన్ 14వ తేదీ విడుదల కాబోతున్నట్టు తేదీతో సహా వార్తలు బయటకు వచ్చాయి.
ఈ విధంగా ధురంధర్ 3 (Dhurandhar 3)సినిమా గురించి విడుదల తేదీ గురించి వార్తలు రావడంతో ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించారు. ఈ విషయంపై క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చభ్రా (Mukesh chhabra) స్పందిస్తూ..ధురంధర్ 3 గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఏమీ లేవు అంటూ ఈయన తెలిపారు. ఇలా ముఖేష్ చభ్రా ధురంధర్ 3 లేదని చెప్పడంతో ఇక ఈ సినిమాకు ఇంతటితో పులిస్టాప్ పడినట్టే అయ్యిందని అభిమానులు భావిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాతల నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమా కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
ఆదిత్యధర్ పై టాలీవుడ్ కన్ను..
ఇక ఈ సినిమా చూసినటువంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ ఆదిత్యధర్ పై టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను పడింది. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఆదిత్యధర్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈయన టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయటానికి సానుకూలంగా ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ధురంధర్2 మేనియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Also Read: V.V Vinayak: అదుర్స్ 2 పై కోన వెంకట్ కామెంట్స్.. వివి వినాయక్ రియాక్షన్ ఇదే!