E-Paper
Advertisement

SRH – Kavya Maran: కమ్మిన్స్ రీ-ఎంట్రీ…48 గంట‌లు కాక‌ముందే ఇషాన్ కెప్టెన్సీ గ‌ల్లంతు..కావ్యపై మ‌ళ్లీ ట్రోల్స్

SRH – Kavya Maran: కమ్మిన్స్ రీ-ఎంట్రీ…48 గంట‌లు కాక‌ముందే ఇషాన్ కెప్టెన్సీ గ‌ల్లంతు..కావ్యపై మ‌ళ్లీ ట్రోల్స్
Advertisement

SRH – Kavya Maran:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప పై మరోసారి ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ గల్లంతు అయ్యే ప్రమాదమున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో కావ్య పాప‌ను టార్గెట్ చేసి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. గాయం కారణంగా మొదటి దశ మ్యాచ్ ల‌కుకు పాట్ కమ్మిన్స్ ( Pat Cummins ) దూరం అవుతాడని, ఇషాన్‌ కిషన్ కు కెప్టెన్సీ ఇచ్చింది కావ్య పాప. అయితే కెప్టెన్సీ ఇచ్చి, 48 గంటలు కాక ముందే పాట్ కమ్మిన్స్ మొదటి మ్యాచ్ ఆడబోతున్నట్లు న్యూస్ బయటకు వచ్చింది. అంటే ఈ లెక్కన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ పదవి మళ్ళీ పాట్ కమ్మిన్స్ కు వెళ్ళనుందని చర్చ జరుగుతోంది. దీంతో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ గల్లంతు అయ్యే ప్రమాదం ఉందని కావ్య పాపను ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: TTP Warns PSL 2026: త‌ల‌లు తెగిపడ‌తాయి, వెంట‌నే పాకిస్తాన్ ను వ‌దిలి వెళ్లిపోండి..విదేశీ క్రికెట‌ర్ల‌కు ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌

పాట్ కమ్మిన్స్ వ‌చ్చేస్తున్నాడు..SRHకు రిలీఫ్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి అంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్ కు పాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. గాయం కారణంగా తొలిదశ మ్యాచ్ ల‌కు పాట్ కమ్మిన్స్ దూరమవుతాడని ముందుగా చర్చ జరిగింది. ఇందులో భాగంగానే ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ ఇచ్చారు. అయితే చివరి క్షణంలో ఫిట్ గా ఉన్నాడని పాట్ కమ్మిన్స్ కు ఎన్ఓసీ ఇచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. దీంతో రేపు ఉదయం బెంగళూరులో పాట్ కమ్మిన్స్ దిగబోతున్నట్లు న్యూస్ బయటకు వచ్చింది. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్ కు పాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉంటాడన్నమాట.

ఇషాన్ కిషన్ కెప్టెన్సీ గల్లంతు ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇషాన్ కిషన్ కు కావ్య పాప కెప్టెన్సీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా దూరమవుతాడు అన్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ అందించింది కావ్య పాప‌. అయితే చివరి క్షణంలో పాట్ కమ్మిన్స్ ఫిట్ గా ఉన్నాడని మొదటి మ్యాచ్ ఆడతాడని వార్త బయటకు వచ్చింది. దీంతో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ గల్లంతు కాబోతుందని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. 48 గంటలు కాకముందే, ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ పదవి కావ్య పాప తొలగించబోతుందని ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. అటు ఇషాన్ కిషన్ బాధతో ఉన్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Advertisement

 

Also Read:  MS Dhoni – Sivakarthikeyan: ఎవడెన్ని కారు కూత‌లు కూసినా 60 ఏళ్లు వ‌చ్చే దాకా ఆడ‌తా, రిటైర్మెంట్ పై ధోని సంచ‌ల‌నం

 

 

?igsh=MWE4Z3A2ZW00N3JwbA==

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×