E-Paper
Advertisement

ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీని రిజెక్ట్ చేసిన CBFC? మరీ అంత డార్క?

ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీని రిజెక్ట్ చేసిన CBFC? మరీ అంత డార్క?
Advertisement

Prashanth Neel:ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్న అతి కొద్ది మంది దర్శకులలో ప్రశాంత్ నీళ్ (Prashanth Neel)కూడా ఒకరు. మాస్, యాక్షన్ పర్ఫామెన్స్ తో డార్క్ థీమ్ లో చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీళ్ తొలిసారి ఒక కొత్త జోనర్ లోకి అడుగు పెట్టారు. అయితే అలాంటి చిత్రానికి ఇప్పుడు సెన్సార్ సమస్యలు ఏర్పడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ సభ్యులు.. సర్టిఫికెట్ ఇవ్వడంలో వెనుకడుగు వేయడంతో మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు . మరి ప్రశాంత్ నీళ్ మూవీని సెన్సార్ సభ్యులు ఎందుకు రిజెక్ట్ చేశారు? మరి చిత్ర బృందం రివైజింగ్ కమిటీని ఆశ్రయించగా, ఆ కమిటీ రియాక్షన్ ఏంటి? ఇలా తదితర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

విడుదల వాయిదా పడ్డ ప్రశాంత్ నీళ్ 418 మూవీ..

అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీళ్ సమర్పణలో తెరకెక్కిన హారర్ సినిమా 418. ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ అడ్డంకులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హారర్ సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) అభ్యంతరం చెప్పడంతో ఈ చిత్రం నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. ఈ చిత్రానికి తొలి పరిచయంలో కీర్తన నాడగౌడ దర్శకత్వం వహించగా.. జూలై 31 2026న విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ రాకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. ఇక సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

మరీ అంత డార్కా?

Advertisement

ఈ చిత్రంలో హారర్ సన్నివేశాలు మితిమీరి ఉండడంతోనే సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి సర్టిఫికేషన్ ఇవ్వడంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇకపోతే గత వారం రోజుల క్రితమే ఈ సినిమాకి సెన్సార్ సమస్యలు తలెత్తడంతో ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మాత్రం ఈ సినిమా మరీ అంత డార్క్ గా ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సెన్సార్ బోర్డు అభ్యంతరం పట్ల నెటిజన్స్ ట్రోల్స్..

మరోవైపు మరికొంత మంది నెటిజన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ సంధిస్తున్నారు. “హారర్ సినిమాలో హారర్ సీన్లు కాక ఇంకేం ఉంటాయి?” అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం . మరి సెన్సార్ బోర్డు నెటిజన్స్ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుంటుందా ? రివైజింగ్ కమిటీ ఈ సినిమాకు న్యాయం చేస్తుందా? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ప్రశాంత్ నీళ్ మూవీకి ఇప్పుడు సెన్సార్ సమస్యలు ఏర్పడడం ఆశ్చర్యకరం . ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ప్రశాంత్ నీళ్ సమర్పిస్తున్నారు.

Advertisement

ALSO READ:బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్.. వీడియో వైరల్!

ప్రశాంత్ నీళ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా గుర్తింపు..

సూర్య రాజు , చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.. ముఖ్యంగా ప్రశాంత్ నీళ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కీర్తన్ నాడగౌడ ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

ప్రశాంత్ నీళ్ చిత్రాలు..

మరొకవైపు ప్రశాంత్ నీళ్ కేజీఎఫ్ 1&2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Related News

సందీప్ రెడ్డి వంగకు విజయ్ కాస్ట్లీ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే..

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..

మమిత బైజు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఆ లిస్ట్ లోకి చేరినట్లే..!

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల తేదీ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే..? 

ముద్దు సీన్ ఉంటే అడల్ట్ సినిమా అవుతుందా? ట్రోలర్స్ కు నాగ వంశీ కౌంటర్!

ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య

నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

Big Stories

Advertisement
×