Bigg boss 10: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss) షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో వివిధ సీజన్లు సెప్టెంబర్ 6వ తేదీన ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెలుగులో నాగార్జున హోస్ట్గా వ్యవహరించగా.. మొత్తం 10 మంది సెలబ్రెటీలు, 6 మంది కామనర్స్ తో అట్టహాసంగా సీజన్ ప్రారంభం అయింది. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ సీజన్ కి హోస్టుగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా మునియమ్మల్, సాత్విక వంటి వారితో పాటు మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు.
కుక్ విత్ కోమాలి అనే షో ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అన్సార్ (Ansar) కూడా ఈ రియాలిటీ షోలోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా అన్సార్ ఉన్నట్టుండి షో ప్రారంభమైన రెండవ రోజే హౌస్ నుంచి బయటకు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి బిగ్ బాస్ తమిళ్ సీజన్ వన్ లో నటుడు భరణి కూడా ఇలాగే హౌస్ లో ఉండలేక గోడ ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు.అయితే ఇప్పుడు మళ్లీ 10వ సీజన్లో అలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ALSO READ:బోయపాటి సెంటిమెంట్‌కు తమిళ బ్రదర్స్ నో?
అన్సార్ విషయానికి వస్తే.. ‘కుక్ విత్ కోమాలి’ అనే షోకి హోస్ట్ గా వ్యవహరించి ..బాగా ఫేమస్ అయ్యాడు.అంతేకాదు పలు టీవీ షోలతో కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయనకు బిగ్ బాస్ సీజన్ 10 లో అవకాశం లభించింది. కానీ ఆయన హౌస్ లోకి అడుగుపెట్టిన రెండవ రోజే ఇలా గోడదూకి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేసిన తీరు అభిమానులలో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనికి గల కారణం ఏంటో తెలియదు కానీ హౌస్ లో తోటి కంటెస్టెంట్ జాసన్ తో జరిగిన గొడవలు , అలాగే కెప్టెన్సీ విషయంలో జరిగిన డిస్కషన్స్ తోనే అన్సార్ మనస్థాపానికి గురయ్యాడని, అందుకే ఇలా హౌస్ నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
షో విషయానికి వస్తే.. మొదటి వారంలో సీరియల్ నటి సాత్వికను కెప్టెన్ గా ఎన్నుకున్నారు. ఇతర సీజన్ల మాదిరిగా కాకుండా ఈ షోలో డెమోక్రసీ రూమ్ వంటి అనేక కొత్త విషయాలు ఏర్పాటు చేశారు . ఈ షో మొదటి రోజున కంటెస్టెంట్లను రెండు జట్లుగా విభజించారు. ముఖ్యంగా గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ పూర్తి భిన్నంగా సాగుతోంది. మరి వీకెండ్స్ రోజుల్లో హోస్ట్ విజయ్ సేతుపతి అన్సార్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి అనే ఉత్కంఠ నెలకొంది.