E-Paper
Advertisement

కోలీవుడ్ భాగ్యంకు బంఫర్ ఆఫర్.. క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలో ఛాన్స్..

కోలీవుడ్ భాగ్యంకు బంఫర్ ఆఫర్.. క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలో ఛాన్స్..
Advertisement

Aishwarya Rajesh : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా సినిమాలలో నటించి తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్ గా మారింది. సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాప్ ని సొంతం చేసుకోవడంతో స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తుంది.. గత ఏడాది వచ్చినా సంక్రాంతి వస్తున్నాం మూవీలో వెంకీ సరసన జోడి నటించింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది కానీ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. తెలుగులో అవకాశాలు వస్తున్న సరే వాటిపై ఈ అమ్మడు ఫోకస్ పెట్టలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ముద్దుగుమ్మ మళ్ళీ కోలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది.. తాజాగా ఈమెకు కోలీవుడ్లో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ మూవీ గురించి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఐశ్వర్య రాజేష్ కు క్రేజీ ఆఫర్..

క్రేజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయలేదు కానీ.. తమిళంలో వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుందని తెలుస్తుంది.. తమిళ ఇండస్ట్రీలోనే మొదటిగా అడుగుపెట్టిన ఈమె పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి కొద్దిగా సొంతం చేసుకుంది.. విజయ్ సేతుపతి వంటి స్టార్స్ సరసన నటించి తమిళ ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది.. అయితే ఇప్పుడు మళ్లీ అదే ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్న అండర్‌-18 అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీ తో రాబోతున్న సినిమాలో ఆమెను నటిస్తున్నారు.. కిచ్చా సుదీప్‌, విక్రాంత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ద్వారా డైరెక్టర్ వెట్రి మారన్ శిష్యుడు కార్తీక్ పెరుమాల్ స్వామి దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్‌న్స్‌ పతాకంపై బి.జగదీష్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలను మొదలుపెట్టుకొని షూటింగ్ కి కొబ్బరికాయ కొట్టేసింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాది చివర్లో కల్లా థియేటర్లలోకి రావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఐశ్వర్య రాజేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

Advertisement

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోలు అందరితో నటించింది. అటు కోలీవుడ్ లో మాత్రమే కాదు ఇటు తెలుగులో కూడా సీనియర్ హీరోల సరసన జతకట్టింది. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ బ్లాక్ మాస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాంలో నటించింది.. అది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. స్టార్ హీరోల సినిమాలలో కాకుండా చిన్న సినిమాల్లో కనిపించింది.. కానీ ఏ ఒక్క సినిమా కూడా స్టార్ ఇమేజ్ ని దక్కించుకోలేకపోయింది.. తర్వాత వచ్చిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడాయి.. ఇకపోతే చిరంజీవి వంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం కూడా ఈమెకు వచ్చినట్లు తెలుస్తుంది.. మొత్తానికి ఈ తమిళ బ్యూటీ ఇటు తెలుగు, అటు తమిళంలో సినిమాలను లైన్ అప్ లో పెట్టుకుంటూ వస్తుంది.. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఆరడజనులకు పైగా సినిమాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాల గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×