E-Paper
Advertisement

కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి.. జూన్ సెకండ్ వీక్‌లో కేబినెట్ విస్తరణకు అవకాశం

కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి.. జూన్ సెకండ్ వీక్‌లో కేబినెట్ విస్తరణకు అవకాశం
Advertisement

Hyderabad: దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం మొదలైందా? తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అధికార ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించిందా? ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

శంషాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

హైదరాబాద్ మీదుగా కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్తున్నారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన పార్టీ చీఫ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణలోని అధికార పార్టీ ముఖ్యనేతలు. అందులో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌లు ఉన్నారు.

తెలంగాణలో రాజకీయాలు, పార్టీ పరిస్థితి, ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఐఆర్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై నేతలంతా చర్చించినట్లు సమాచారం. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు, బడ్జెట్ ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డి.. అధినేతకు వివరించినట్టు తెలుస్తోంది.

Advertisement

వివిధ అంశాలపై చర్చ..  కేబినెట్ విస్తరణకు సంకేతాలు

పార్టీ క్యాడర్‌‌ను బలోపేతం చేయడం, ప్రభుత్వ-పార్టీ మధ్య సమన్వయాన్ని పటిష్టం చేయడంపై చర్చించినట్టు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యక్రమాలపై మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో రేవంత్ కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పు విషయాలపై చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయమై జూన్ ఫష్ట్ వీక్‌లో రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో చర్చిస్తామని చీఫ్ అన్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ రెండో వారంలో కేబినెట్ విస్తరణ ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో తెలంగాణలోని అధికారంలోని కొందరు నేతలు అప్పుడే మంతనాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

ALSO READ: కవిత వెనుక CM చంద్రబాబు ఉన్నారా? అందుకే జెండాలో పసుపు కలర్, టీఆర్ఎస్ చీఫ్ ఏమన్నారు?

 

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×