IPL 2026 Finals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఫైనల్స్ మరికాసేపట్లో జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో గుజరాత్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్ ఇవాళ అంటే ఆదివారం సాయంత్రం ఉండగా… శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అహ్మదాబాద్ చేరుకుంది గుజరాత్. దీంతో ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే ఇవాళ ఫైనల్స్ బరిలో దిగనుంది గిల్ సేన. ఇది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో భాగంగా ఇవాళ గుజరాత్ వర్సెస్ బెంగళూరు ( GT VS RCB) మధ్య మ్యాచ్ ఉంది. అయితే మొన్న 29వ తేదీన క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన గుజరాత్ జట్టు… న్యూ చండీగఢ్ లోనే చిక్కుకుంది. అక్కడ ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. ఈ క్రమంలో నిన్న ఉదయమే రావాల్సిన గుజరాత్ టైటాన్స్… శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అహ్మదాబాద్ చేరుకుంది. తుఫాను ( Storm) కారణంగా విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. అందుకే శనివారం అర్ధరాత్రి తర్వాత అహ్మదాబాద్ చేరుకుంది గుజరాత్ టైటాన్స్. అలాగే న్యూ చండీగఢ్ నుంచి అహ్మదాబాద్ వచ్చేందుకు రెండు రాష్ట్రాలు దాటి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ట్రావెలింగ్ టైం కూడా ఎక్కువగా పట్టింది. ఇక నిన్న అర్ధరాత్రి కూడా గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు సరిగ్గా నిద్ర పోలేదట.
జర్నీ చేసిన అలిసిపోయిన గుజరాత్ ప్లేయర్లు, ఇవాళ రాత్రి మళ్ళీ ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు సరిగ్గా ఆడకపోవచ్చు అని.. దీంతో బెంగళూరు విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన బెంగుళూరుకు మాత్రం అడ్వాంటేజ్ మారింది. ఎందుకంటే ఐదు రోజుల కిందటే ఫైనల్స్ కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… అహ్మదాబాద్ చేరుకొని ప్రాక్టీస్ చేసింది. అక్కడి వాతావరణాన్ని అలవాటు చేసుకుంది. గుజరాత్ బౌలర్లను అంచనా వేస్తూ ప్రాక్టీస్ చేశారు. అయితే గుజరాత్ టైటాన్స్ మాత్రం నిన్న అర్ధరాత్రి అహ్మదాబాద్ చేరుకోవడం.. నెగిటివ్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. కానీ గుజరాత్ కు అహ్మదాబాద్ హోమ్ గ్రౌండ్ కాబట్టి.. ఆర్సిబి ఆటలు సాగవాని మరికొంతమంది అంటున్నారు.