Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ మిషన్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా స్టార్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈయన ప్రతి ఏడాది ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ ఏడాది సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఈయన తదుపరి సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని తిరిగి విక్టరీ వెంకటేష్ (Venkatesh)తో చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.
అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి తన కెరీర్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అనిల్ రావిపూడి కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా అద్భుతమైన డాన్సర్ అనే సంగతి మనకు తెలిసిందే. పలు సందర్భాలలో ఈయన తన డాన్స్ తో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు అలాగే నటనపరంగా కూడా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే దర్శకుడిగా కాకుండా వెండితెరపై నటించే అవకాశాలు వస్తే మీరు హీరోగా నటిస్తారా? లేదంటే విలన్ పాత్రలో నటిస్తారా? అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ.. తనకు హీరోగా నటించడం కంటే విలన్ పాత్రలలో నటించడమే ఇష్టం అని తెలిపారు. తనకు ఎంతో ఇష్టమైన విలన్ ఎవరు అంటే రఘువరన్ అంటూ ఈయన సమాధానం చెప్పారు. ఇలా తనకు విలన్ పాత్రలలో నటించడం అంటే ఇష్టం అంటూ ఈయన చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
విలన్ గా ఫహద్ పజిల్..
మరి దర్శకుడిగా కాకుండా ఈయన వెండితెరపై విలన్ పాత్రలో ఎప్పుడు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం అయితే అనిల్ రావిపూడి పూర్తిగా దర్శకత్వం పైనే దృష్టి సారించారు. ఇక త్వరలోనే అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా పూజ హెగ్డే నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో పుష్ప విలన్ ఫహద్ పజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Also Read: Chandrahas: జేడీ చక్రవర్తిని గెస్ట్ గా అనవసరంగా పిలిచా.. చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్!