E-Paper
Advertisement

Chandrahas: జేడీ చక్రవర్తిని గెస్ట్ గా అనవసరంగా పిలిచా.. చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్!

Chandrahas: జేడీ చక్రవర్తిని గెస్ట్ గా అనవసరంగా పిలిచా.. చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Chandrahas: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాసన్ (Chandrahas)ఇటీవల బారాబర్ ప్రేమిస్తా (Barabar Premistha) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా గుంజి గుంజి అనే పాట పాడిన సంగతి తెలిసిందే. ఇలా సినిమా ఈవెంట్లలో హీరోలు పాటలు పాడటం సర్వసాధారణం. అయితే చంద్రహాస్ ఈ సినిమా వేడుకలో భాగంగా పాడిన ఈ పాట బూతులతో ఉండటంతో ఈ పాటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడమే కాకుండా ఏకంగా డిబేట్లు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ వివాదం పై సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జెడి చక్రవర్తి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత జెడి చక్రవర్తి ఈ పాట పై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

చప్పట్లు కొట్టి ప్రశంసించారు..

ఈ వీడియోలో భాగంగా జేడీ చక్రవర్తి స్పందిస్తూ సినిమా పబ్లిసిటీ కోసం ఇలాంటి బూతులు అవసరం లేదని తెలిపారు . స్టేజ్ మీద ఈ పాట విన్నప్పుడే నేను అక్కడి నుంచి వచ్చేయాలనుకున్నాను కానీ అలా చేయటం వల్ల సినిమాకు డ్యామేజ్ అవుతుందన్న ఒక కారణంతోనే ఆగిపోయానని చక్రవర్తి తెలియజేశారు. అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రహాస్ ఇటీవల సినిమా ప్రమోషన్లలో భాగంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఈవెంట్ లో జె.డి చక్రవర్తి చప్పట్లు కొట్టి నన్ను ప్రశంసించారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట మార్చారని ఇలా రెండు విధాలుగా ప్రవర్తించడం చాలా బాధగా ఉందని తెలిపారు.

రిగ్రేట్ గా ఫీల్ అవుతున్నాను..

Advertisement

నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అక్కడికక్కడే చెప్పాలి కానీ , నా దగ్గర ఒకలాగా తర్వాత మరోలాగా మాట్లాడటం సరైనది కాదు. అలాగే చక్రవర్తి ముందుగా మెసేజ్లు ఫోన్ కాల్ ద్వారా వేరేలా మాట్లాడారని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయని తెలిపారు. జెడి చక్రవర్తి ఒక పెద్ద స్థాయిలో ఉన్నవారు. అలాంటి వారు ఏ విషయం అయినా నేరుగా మాట్లాడాలి కానీ స్టేజ్ మీద ఒకలాగా బయట ఒకలాగా మాట్లాడకూడదు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు నేను ఫంక్షన్ కి పిలిచానా అని ఇప్పుడు రిగ్రేట్ గా ఫీల్ అవుతున్నాను అంటూ చంద్రహాస్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

చంద్రహాస్ పై కేసు..

Advertisement

ఇలా ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి చంద్రహాస్ చేసిన వ్యాఖ్యలపై జేడీ చక్రవర్తి స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వివాదంలో భాగంగా ఇప్పటికే చంద్రహాస్ పై కేసులు నమోదు అయినప్పటికీ తాను ఎలాంటి తప్పు చేయలేదని క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. తాజాగా జెడి చక్రవర్తి పై యాటిట్యూడ్ స్టార్ట్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Also Read: Ramcharan: పెద్ది టీం కోసం చరణ్ స్పెషల్  గిఫ్ట్స్..ఎంత ప్రత్యేకంగా ఉందో?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×