E-Paper
Advertisement

Fire Accident: నాంపల్లి FSLలో భారీ అగ్నిప్రమాదం.. క్లూస్ టీమ్ రిపోర్టుల పరిస్థితి ఏంటి?

Fire Accident: నాంపల్లి FSLలో భారీ అగ్నిప్రమాదం.. క్లూస్ టీమ్ రిపోర్టుల పరిస్థితి ఏంటి?
Advertisement

Fire Accident: హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఈరోజు మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కీలకమైన దర్యాప్తు పత్రాలు, నమూనాలు ఉండే ఈ కార్యాలయంలో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే మెుత్తం వ్యాపించాయి. కార్యాలయం నుండి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ.. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Advertisement

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత విస్తరించకుండా ఉండేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా తనిఖీలు చేస్తున్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు, కెమికల్స్ , రిపోర్టులు ఉంటాయి. ఈ ప్రమాదం వల్ల ఏవైనా కీలకమైన రికార్డులు కాలిబూడిదయ్యాయా అనే కోణంలో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Also Read: కేకే కుమారుడికి బెదిరింపు కాల్స్.. రూ. 3 కోట్లు డిమాండ్.. అసలేం జరిగింది?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×