E-Paper
Advertisement

Ramcharan: పెద్ది టీం కోసం చరణ్ స్పెషల్  గిఫ్ట్స్..ఎంత ప్రత్యేకంగా ఉందో?

Ramcharan: పెద్ది టీం కోసం చరణ్ స్పెషల్  గిఫ్ట్స్..ఎంత ప్రత్యేకంగా ఉందో?
Advertisement

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది(Peddi) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాని ముందుగా మార్చి 27వ తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ ఏప్రిల్ 30వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక షూటింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది.

పెద్ది టీమ్ కు చరణ్ గిఫ్ట్స్..

ఇక రామ్ చరణ్ ఉపాసన డెలివరీ అయిన నేపథ్యంలో కొద్ది రోజులు షూటింగుకు బ్రేక్ ఇచ్చినప్పటికీ తిరిగి ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఇకపోతే రామ్ చరణ్ పెద్ది టీం కోసం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే ఇలా తనకు ఒక కొడుకు కూతురు జన్మించడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ దంపతులు కొంతమంది మీడియా వారికి ఇటీవలే ఎలిఫెంట్ థీమ్ తో కొన్ని గిఫ్ట్స్ పంపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ పెద్ది టీం అందరికీ కూడా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారని తెలుస్తోంది.

మహిళలకే మొదటి ప్రాధాన్యత..

Advertisement

పెద్ది టీం కోసం రామ్ చరణ్ ఒక స్పెషల్ బాక్స్ లో కొన్ని విలువైన కానుకలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ బాక్స్ పై తన కుటుంబ సభ్యులందరి పేర్లతో గిఫ్ట్స్ అందించడం విశేషం. ముఖ్యంగా తన నాయనమ్మ అంజనా దేవి ఉపాసన నానమ్మ తాతయ్యలు సుచరిత, ప్రతాప్ రెడ్డి, సురేఖ చిరంజీవి , శోభన అనిల్ కామినేని ఆశీర్వాదాలతో తన కుమార్తె క్లీన్ కార తనకొక తమ్ముడు అలాగే చెల్లెలు జన్మించినందుకు ఈ కానుకలను అందిస్తున్నట్లు ఉపాసన రాంచరణ్ పేర్లతో ఈ గిఫ్ట్స్ అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇలా ఈ గిఫ్ట్ బాక్స్ మీద ముద్రించిన పేర్లు ప్రత్యేకంగా నిలిచాయి .ఇక్కడ మహిళలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మెగా కుటుంబంలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో ఈ ఒక్క ఫోటో ద్వారా స్పష్టం అవుతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారింది. మరి ఇందులో ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఉపాసన తన ఇద్దరు పిల్లలతో హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ కావడంతో రామ్ చరణ్ తిరిగి పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల పెద్ది సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇందులో రాంచరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటించారు.

Also Read; Allu Sirish: శిరీష్ పెళ్లి విషయంలో అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం..అంత మాట అన్నారా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×