E-Paper
Advertisement

పాటలకు లక్షల్లో వ్యూస్.. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ..చరణ్ అర్జున్ ఆవేదన!

పాటలకు లక్షల్లో వ్యూస్.. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ..చరణ్ అర్జున్ ఆవేదన!
Advertisement

Charan Arjun:చరణ్ అర్జున్..తెలంగాణా మట్టి నుండి ఎదిగి ఎన్నో సినిమాలకి సంగీతం అందించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ రైటర్ చరణ్ అర్జున్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మనసులోని మాట బయటపెట్టారు. ఇండస్ట్రీలో తనకు ఎదురైన కష్టాలు, ఎన్నో పాటలు చేసినా సరైన గుర్తింపు రాకపోవడం, సినిమా అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవడం గురించి ఇలా చెప్పుకొచ్చారు.

ఒక టైమ్‌లో ఇక సినిమాలు చాలు.. అన్నీ మానేసి సాధారణ జీవితం గడిపేద్దామని కూడా అనుకున్నానని, కానీ అదే సమయంలో వచ్చిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా తన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచిందని చెప్పారు.

Advertisement

పాటలకు వ్యూస్ వస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నా

చరణ్ అర్జున్ పేరు చెప్పగానే చాలామందికి తెలంగాణ జానపద పాటలు, మాస్ బీట్స్, పల్లెటూరి మట్టి వాసన గుర్తుచేసే సంగీతం గుర్తుకొస్తాయన్న సంగతి తెల్సిందే.అయితే పాటలకి మిలియన్ల వ్యూస్ వస్తున్నా, సినిమా ఛాన్స్ లు అనుకున్నట్టుగా రావట్లేదన్నబాధ ఉండేదని వాపోయారు. పాటలకు మంచి వ్యూస్ వస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నా, సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు పరిశీలించే సమయంలో తన పేరు కనిపించకపోవడం బాధ కలిగించేదని చెప్పారు.నువ్వో రాయి నేనో శిల్పి,ఎట్టుండే రా ఊరు ఎట్టుండే రా,KCR కథాగానం ఇలా ఎన్నో పాటలు చరణ్ అర్జున్ కలం నుండి జాలు వారాయని ,వాటికి సంగీతం కూడా అతడే అందించిన సంగతి మనకి తెలిసిందే.

Advertisement

అయితే సినిమా చేసే అవకాశం వచ్చిందని సంతోషపడేలోపే పరిస్థితులు మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. తనకు తెలిసిన దర్శకులు కూడా సినిమా మొదలయ్యే సమయానికి మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకున్న సందర్భాలు ఎదురయ్యాయని చరణ్ అర్జున్ గుర్తుచేసుకున్నారు.

తన సంగీతం నచ్చడం లేదా?

ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే  తనలోనే ఏదైనా లోపం ఉందా? తన సంగీతం నచ్చడం లేదా? ఇండస్ట్రీలో తాను ఉండాలా లేదా ? అనే ఆలోచనలు వచ్చేవని వివరించారు. ఇక ఒకానొక సమయంలో సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉండటం కంటే, అన్నీ వదిలేసి సాధారణ జీవితం గడపడం మంచిదని అనుకున్నానని తెలిపారు.

పంచవటి కాలనీలో అద్దెకు తీసుకున్న స్టూడియోలో ఎన్నో పాటల కోసం పనిచేసిన ఆయన, చివరికి ఆ స్టూడియోను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. స్టూడియోలోని వస్తువులను సర్దేసి, కొత్తగా కొనుగోలు చేసిన ఇంటికి తరలించినట్లు తెలిపారు. ఇక మళ్లీ స్టూడియో ఏర్పాటు చేసుకోవాలా? సంగీతాన్ని కొనసాగించాలా? లేక సినిమాలకు దూరంగా ఉండాలా? అనే ఆలోచనల్లో ఉన్న సమయంలోనే ‘గరివిడి లక్ష్మి’ సినిమా అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు.

ఇపుడు నెట్టింట్లో హాట్ టాపిక్

అయితే ఆ సినిమా అవకాశం కూడా మొదట్లో అనుకున్నంత పెద్దది కాదని, దర్శకుడు తనను మొత్తం సినిమాకు సంగీతం అందించమని కాకుండా, ఒక్క పాట చేయాలని మాత్రమే అడిగారని చరణ్ అర్జున్ చెప్పారు. అప్పటికే ఎన్నోసార్లు నిరాశ ఎదురవడంతో మరోసారి ఒక్క పాట చేసి ఆగిపోవడం తనకు ఇష్టం లేదని వివరించారు. సినిమా చేస్తే పూర్తి చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉండాలని భావించినట్లు తెలిపారు.

మొత్తానికి, సినిమా ఛాన్స్ లు రాక నిరాశకు గురై స్టూడియోనే ఖాళీ చేసిన స్థాయి నుంచి మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం దక్కడం వరకు రణ్ అర్జున్ చెప్పిన అనుభవాలు ఆసక్తికరంగా ఉండటంతో ఈ ఇంటర్వ్యూ ఇపుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది..

ALSO READ :సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

Tags

Related News

రిలీజ్ డేట్ చెప్పి వాయిదా వేస్తే ఎలా?ఆదర్శ కుటుంబం పై నాగార్జున కామెంట్స్!

వీకే నరేష్ విగ్గు ధర ఎంతో తెలుసా? ఒక ఫ్యామిలీ లగ్జరీగా బ్రతకొచ్చుగా?

రామాయణ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..ఎప్పుడు? ఎక్కడంటే?

జైలర్ 2లో హృతిక్ రోషన్.. 5 నిమిషాలకే అన్ని కోట్లా?

నా కోరిక నెరవేరలేదు.. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ పై విద్యాబాలన్ కామెంట్స్!

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

డైరెక్టర్ పై విద్యాబాలన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

Big Stories

Advertisement
×