E-Paper
Advertisement

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?
Advertisement

Kanakavva Songs:కనకవ్వ ..కనకవ్వ ..కనకవ్వ ..ఇపుడు ఎక్కడ చూసినా ఈవిడ పేరే మారుమ్రోగిపోతుంది.గొంతెత్తి పాడింది కోయిలా..పల్లె బతుకుల్ని తీయని పాటగా ”అంటూ తాజాగా పాడిన మరో బతుకమ్మ పాట ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.దీంతో మరోసారి కనవవ్వ పాటలపై ఇపుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక ఈ క్రమంలోనే అసలు సింగర్ కనకవ్వ పాటలకి ఇంత క్రేజ్ ఎందుకంటూ ఆరాలు తీస్తున్నారు ఫోక్ లవర్స్.

ఆమె స్పెషాలిటీ ఏంటంటే

Advertisement

సింగర్ కనకవ్వ ఆలియాస్ గొట్టె కనకవ్వ పుట్టింది తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడిగెపల్లి గ్రామంలో అన్న సంగతి తెల్సిందే.ఇక ఆమె స్పెషాలిటీ ఏంటంటే ఆవిడ పాడుతుంటే ఒక సింగర్ పాడినట్టుగా కాకుండా మన అమ్మమ్మనో,నాన్నమ్మనో పాడినట్టు ఉండటమే. ఇక ఆమె గొంతు నుండి వచ్చే పదాలు తెలంగాణా మట్టి వాసనలని వెదజల్లడం, తెలంగాణా జీవితాలు ఆమె పాటల్లో తొంగిచూడటం కూడా ఒక కారణమని చెప్పాలి.

ఎక్కడా ఆర్టిఫిషియల్ గా కాకుండా

Advertisement

ముఖ్యంగా ఎక్కడా ఆర్టిఫిషియల్ గా కాకుండా చాలా న్యాచులర్ గా ,మనల్ని జోలపాడినట్టుగా,అందరికి అర్థం అయ్యే రీతిలో ఆ పాటలు ఉండటం వల్లే పిల్లా ,పెద్దా ,ముసలి ,ముతకా ,ఆడా,మగా ఇలా అందరు ఆమె పాటలకి కనెక్ట్ అవుతున్నారు. ఇక చాలా మంది పాటల్లో కనబడే అతి ఆమె పాటల్లో కనిపించకపోవడం అనేది మరో కారణం అని చెప్పాలి. ముఖ్యంగా ఆమె పాట వినగానే పల్లె జ్ఞాపకాలు, తెలంగాణా సంస్కృతి సాంప్రదాయాలు మనసుల్లో మెదులుతాయి.

ఆమె పాడిన పాటలకి  డిమాండ్

దీని వల్లే యూట్యూబ్ లో ఆమె పాడిన పాటలకి డిమాండ్ కనిపిస్తుంది. తొలిసారిగా ఆమెని వెలుగులోకి తీసుకొచ్చిన నర్సపల్లె అనే పాట ఇప్పటికి దాదాపు 37 కోట్లకి పైగా వ్యూస్ ని సాధించండి అంటే ఆమె గొంతుకు ఫోక్ లవర్స్ కాని ఆడియన్స్ కాని ఎంతలా కనెక్ట్ అయ్యారో చెప్పక్కర్లేదు. ఇక ఆ కోవలోనే వచ్చిన ఎన్నో పాటలు మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాయి కూడా.

పాటలకి మిలియన్ల వ్యూస్

ముఖ్యంగా ఆమె గొంతులో నుండి జాలువారిన నర్సపల్లె, “టుంగుటుయ్యాలో టుంగుటుయ్యాలో”,గెన్నె రామ గెన్నె రామ,గిజ్జగిరి,అవ్వ మనవడి పాట, కొంగుల్లో సుట్టుండ్రే కోమలాంగి,గిర్రు పిట్ట,ఎవలు రమ్మన్నారు కొడుకా వంటి పాటలు ఇప్పటికీ ఫోక్ లవర్స్ ని ఎంతగానో అలరిస్తున్నాయి.మరీ ముఖ్యంగా వీటిలో ,గెన్నె రామ గెన్నె రామ,గిజ్జగిరి,అవ్వ మనవడి పాటలకి మిలియన్ల వ్యూస్ ఉండటం బట్టి చూస్తే కనకవ్వ పాటలు సోషల్ మీడియాని ఎలా షేక్ చేస్తున్నాయో అర్థం అవుతుంది.

కనకవ్వని మెచ్చుకొని తీరాల్సిందే !

ఇక వీటితో పాటు సంక్రాంతి పాటలు, మేడారం జాతర పాటలు ఎన్నో కనకవ్వ గొంతు నుండి జాలు వారినవే.ఏది ఏమైనా ఒక మారుమూల పల్లె నుండి వచ్చి ఇలా తనదైన గొంతుతో ఎంతో మందికి ఫేవరేట్ గా నిలిచిన కనకవ్వని మెచ్చుకొని తీరాల్సిందే !

Tags

Related News

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

ఏంటి.. సుధీర్ కి అప్పుడే పెళ్ళైపోయిందా.. వైరల్ అవుతున్న పిక్స్!

దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!

Gundeninda Gudigantalu : ప్రభా టాలెంట్ కు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. సూపర్ అంతే..

బాధ్యత ఉండక్కర్లేదా.. ‘అలయన్స్ ఎయిర్ లైన్స్’ పై యాంకర్ గాయత్రి అసహనం..వీడియో వైరల్!

Intinti Ramayanam Pallavi : పల్లవి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా టెన్షన్.. రోహిణి కోపం కొల్లేరు.. గుణకు సాయం..

Big Stories

Advertisement
×