E-Paper
Advertisement

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?
Advertisement

BRS Strategy: గులాబీ దళంను అధిష్టానం అప్రమత్తంచేస్తోంది. రాజకీయ పరిణామాలు, గత అనుభవాల నేపథ్యంలో పార్టీ శ్రేణులను నిరంతరం ప్రజల్లో ఉంచడంతోపాటు, ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం దృష్టి సారించింది. కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా.. వాటి తర్వాత కూడా ప్రజా కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ నేతలకు కార్యాచరణతో దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటుకోవడంపై దృష్టి పెట్టాలని ఆదేశించింది.

సభల తర్వాత.. కార్యాచరణ!

సభలు నిర్వహించడం, భారీగా జనసమీకరణ చేయడంతోనే బాధ్యత తీరిపోయినట్లు భావించవద్దన్నది బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన అంశాలను ఆ తర్వాత కూడా సజీవంగా ఉంచాలని భావిస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని యోచిస్తోంది. స్థానిక సమస్యలను గుర్తించడం, వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది.

విమర్శలకు ప్రతి విమర్శలు!

Advertisement

ప్రభుత్వం నుంచి బీఆర్‌ఎస్‌పై, పార్టీ నేతలపై విమర్శలు వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టడంలో వెనుకబడకూడదని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నేతల ఆరోపణలకు వాస్తవాలు, ఆధారాలతో సమాధానమివ్వాలని, పార్టీ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచిస్తోంది. ప్రత్యర్థుల విమర్శలకు స్పందించకుండా మౌనంగా ఉండటం వల్ల పార్టీ వాదన ప్రజల్లోకి వెళ్లడంలో ఇబ్బందులు తలెత్తుతాయని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ.. రాజకీయంగా ఎదురుదాడి చేయాలని యోచిస్తోంది.

విద్యుత్‌ కోతలపై పోరాటం!

మరోవైపు విద్యుత్‌ కోతలు, సాగు, తాగునీటి ఎద్దడికి గల అంశాలంటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోంది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, కోతలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, నీటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న సమస్యలపై పోరాడితేనే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. విద్యుత్‌ సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటిపై నిరసనలు, ప్రజా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా కార్యాచరణ చేపట్టాలని భావిస్తోంది.

Advertisement

Also read: జైలర్ 2లో హృతిక్ రోషన్.. 5 నిమిషాలకే అన్ని కోట్లా?

నిరంతరం జనంలోనే..

గత రాజకీయ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసుకోవడంపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలపై స్పందించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. సభల సమయంలోనే హడావుడి చేసి, ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉండే ధోరణికి స్వస్తి పలకాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. నిరంతర రాజకీయ కార్యాచరణతో ప్రజల్లో ఉండాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఏయే పంటలు ఎండిపోయాయి..?

రైతులకు ఎదురైన ఇబ్బందులను కేవలం కార్యాలయాల్లో ఉండి తెలుసుకోవడం కాకుండా, గ్రామాల్లోని పొలాల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని పార్టీ ఆదేశించింది. పంటలు ఎందుకు ఎండిపోయాయి, సాగునీరు అందిందా, వర్షాలు లేక ఎంత నష్టం వాటిల్లింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. చేపడుతున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయనే అంశాలను రైతులను అడిగి తెలుసుకోవాలని, ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బతింది?, ఏయే పంటలు ఎండిపోయాయి,? పెట్టుబడి ఎంత పెట్టారు? వంటి వివరాలు నమోదు చేయాలని నేతలకు సూచనలు చేసినట్లు సమాచారం. నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారి సమస్యలను పార్టీ దృష్టికి తీసుకెళ్లి అండగా ఉంటామని భరోసాతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పరిహారం అందేలా పోరాటం చేస్తామని హామీ ఇవ్వాలని అంతేకాదు అధికారులకు సైతం రైతులతో కలిసి వినతులు ఇవ్వాలని సూచనలు చేసినట్లు తెలిసింది. అదే విధంగా సేకరించిన వివరాల ఆధారంగా పంట నష్టం వివరాలను మీడియా వేదికగాను ప్రభుత్వానికి వివరించబోతున్నట్లు సమాచారం.

అదే విధంగా..

ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాత్రమే కాకుండా, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీ శ్రేణులను భాగస్వాములను చేయడం, నిత్యం అప్రమత్తంగా ఉంచడం, ప్రతి రాజకీయ పరిణామానికీ సమయానుకూలంగా స్పందించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ దళంలో అప్రమత్తత పెంచుతూ, నిరంతర ప్రజా కార్యాచరణకు ప్రాధాన్యమివ్వడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Also read: రామాయణ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..ఎప్పుడు? ఎక్కడంటే?

Tags

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×