Chennai love story Twitter review: విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి.. సీనియర్ స్క్రీన్ ప్లే రైటర్ రవి నంబూరి దర్శకుడిగా మారి దర్శకత్వం వహించారు. సిరి హనుమంత్, త్రిగుణ్ వంటి క్రేజీ స్టార్లు కూడా ఇందులో నటించారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించడంతోపాటు.. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్కేఎన్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ , ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. అలాంటి ఈ సినిమా జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అప్పుడే ఈ సినిమా ప్రీమియర్ షో పడిపోయింది.. సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ రూపంలో పంచుకుంటున్నారు. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంట మెప్పించిందా? అసలు సాయి రాజేష్ బేబీ రేంజ్ లో ఈ సినిమా కథను అందించారా? ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మిస్ చేసుకున్న ఈ సినిమాలో బేబీ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందా? అసలు ఆడియన్స్ ఏం చెబుతున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
also read:
సెన్సార్ నుండి ఒక్క కట్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకొని 3 గంటలు నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథ విషయానికి.. స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) సినిమాలోకి రావాలని ఆశతో చెన్నై వెళ్తాడు. అయితే అప్పటికే లవ్ ఫెయిల్యూర్ తో ఉన్న అమ్మాయి శ్రీ గౌరీ ప్రియను కలుస్తాడు. మొదట శంకర్ ను ఆమె దూరం పెట్టినా.. ఆ తర్వాత ఇద్దరు లవ్లో పడతారు. మరి గౌరీ ప్రియ ఫస్ట్ లవ్ ఏంట ఫస్ట్ లవ్ కంటే రెండో లవ్ ఎందుకు ఆమెకు గొప్పగా అనిపించింది ? చివరికి ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ALSO READ:నాతో పనిచేసిన వాళ్లందరూ మంత్రులయ్యారు – బాబీ డియోల్ ఊహించని కామెంట్స్!
కిరణ్ అబ్బవరం తన క్యారెక్టర్ స్టీవెన్ శంకర్ పడ్డ కష్టాల గురించి చెప్పే సన్నివేశంతో సినిమా మొదలవుతుందట.
సినిమాలో కిరణ్ అబ్బవరం తన క్యారెక్టర్ ల.. స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్) పడ్డ కష్టాల గురించి ముచ్చట చెప్తుండు. ట్రాక్ ఎట్లా పోతదో చూడాలి. #ChennaiLoveStory@Kiran_Abbavaram @srigouripriya @sknonline @Ravinamburii @MassMovieMakers @AmruthaProd @DheeMogilineni
— BIG TV Cinema (@BigtvCinema) July 23, 2026
అయితే స్టార్టింగ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని సమాచారం. ఇక ఫస్ట్ పాట మొత్తం రీల్ లాగా అనిపిస్తోందని, వాయిస్ కూడా సెట్ కాలేదని, తొలిప్రేమ సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేదంటూ ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “థియేటర్ల రెస్పాన్స్ మేటర్ అయ్యిందా?” అనే డైలాగ్ కి మాత్రం గట్టిగా విజిల్స్ పడ్డాయట.
ఇప్పటికైతే ఓకే కానీ.. ఏందో ఒకలా ఉంది. ఫస్ట్ హాఫ్. మ్యూజిక్ ఉంది స్టోరీ గుడ్
సెకండ్ హాఫ్ ల ఏదో ఒకటి చేయాలి. సర్ అయినా మొదటి నుండి గౌరీప్రియ ఏడుస్తూనే ఉంది,
చూద్దాం ఇక సెకండ్ హాఫ్ ఎట్లుంటదో.#ChennaiLoveStory@Kiran_Abbavaram @srigouripriya @sknonline @Ravinamburii… pic.twitter.com/AHxYFlCv6d
— BIG TV Cinema (@BigtvCinema) July 23, 2026
ఇకపోతే హాస్పిటల్ దగ్గర వచ్చే సీన్ ఎమోషనల్ గా ఉందని, ఆ సైలెంట్ బ్రీత్ దగ్గర మణిశర్మ ఇచ్చిన మ్యాజిక్ వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం పరవాలేదు అనిపించుకుంది .
హాస్పిటల్ సీన్ ఎమోషనల్ గా ఉంది. ఆ సైలెంట్ బ్రీత్ దగ్గర మణిశర్మ సార్ ఇచ్చిన మ్యూజిక్ ప్రాణం పోసింది. థాంక్యూ మణిశర్మ సార్. #ChennaiLoveStory@Kiran_Abbavaram @srigouripriya @sknonline @Ravinamburii @MassMovieMakers @AmruthaProd @DheeMogilineni
— BIG TV Cinema (@BigtvCinema) July 23, 2026
అయితే ఇక్కడ స్టోరీ గుడ్.. మ్యూజిక్ ఎక్కువ ఇచ్చినట్లు ఉంది అంటూ ఆడియన్స్ తెలిపారు.
హాస్పిటల్ సీన్ ఎమోషనల్ గా ఉంది. ఆ సైలెంట్ బ్రీత్ దగ్గర మణిశర్మ సార్ ఇచ్చిన మ్యూజిక్ ప్రాణం పోసింది. థాంక్యూ మణిశర్మ సార్. #ChennaiLoveStory@Kiran_Abbavaram @srigouripriya @sknonline @Ravinamburii @MassMovieMakers @AmruthaProd @DheeMogilineni
— BIG TV Cinema (@BigtvCinema) July 23, 2026
సెకండ్ హాఫ్ లో.. “అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉండవు.. ఉంటే చరిత్రకు నచ్చవు”. “ఆవిడ ఏమో బెడ్ రూమ్లో.. వీడేమో హాల్లో.. మధ్యలో ఏం చేయలేని నేను.. అసలు ఏందిరా ఈ ఆత్మ క్షోభ “వంటి డైలాగ్స్ థియేటర్లలో చప్పట్లతోపాటు ఈలలు, నవ్వులు పూయించాయి.
ఆవిడ ఏమో బెడ్ రూమ్ ల.. వీడేమో హాల్ ల.. మధ్యల ఏం చేయలేని నేను.. అసలు ఏందిరా ఈ ఆత్మ క్షోభ! 😂 ఈ డైలాగ్ కాడ మాత్రం థియేటర్ల మంచి నవ్వులొచ్చినయ్.#ChennaiLoveStory@Kiran_Abbavaram @srigouripriya @sknonline @Ravinamburii @MassMovieMakers @AmruthaProd @DheeMogilineni
— BIG TV Cinema (@BigtvCinema) July 23, 2026
ఓవరాల్ గా చెప్పేదేమిటంటే.. మ్యూజిక్ తోనే సినిమాకు ప్రాణం పోశారు. కానీ ఎడిటింగ్ లో ఇంకొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా బెటర్ గా ఉండుంటే థియేటర్లో బొమ్మ దద్దరిల్లిపోయేది. పూర్తి రివ్యూ మరికొన్ని గంటల్లో రానుంది.
అసలు ముచ్చట ఏందంటే.. మ్యూజిక్ తోని మంచిగ ప్రాణం పోసిండ్రు గానీ, ఆ ఎడిటింగ్ కత్తెర ఇంకొంచెం గట్టిగ వాడితే బాగుండు. ఓవరాల్ గా బెటర్ గుంటే బొమ్మ దద్దరిల్లిపోయేది! పూర్తి పంచాయితీ కొద్దిసేపట్ల.. కంప్లీట్ రివ్యూ సూన్! 🤙#ChennaiLoveStory@Kiran_Abbavaram @srigouripriya @sknonline…
— BIG TV Cinema (@BigtvCinema) July 23, 2026