E-Paper
Advertisement

ప్ర‌తీ బంతి 150 కి.మీ వేగమా? మాయంక్ యాద‌వ్ కు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!

ప్ర‌తీ బంతి 150 కి.మీ వేగమా? మాయంక్ యాద‌వ్ కు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!
Advertisement

Shoaib Akhtar :  టీమిండియా వర్సెస్ జింబాబ్వే (Zimbabwe vs India) మధ్య గురువారం టి20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మూడు టి20 సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ సేన శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన టీమిండియా క్రికెటర్లు… ఎట్టకేలకు విజయాల బాట పట్టారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… మొదటి టీ20 లో 7 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. అయితే తొలి టి20 లో ఆడిన మయాంక్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ తో రెచ్చిపోయాడు. నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్ర‌మంలోనే మయాంక్ యాదవ్ (Mayank Yadav)పై షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాయంక్ యాద‌వ్ కు డోపింగ్ టెస్టులు చేయాల్సిందేన‌ని బాంబ్ పేల్చారు.

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

మాయంక్ యాద‌వ్ కు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!

Advertisement

మొదటి టీ20లో మయాంక్ యాదవ్ ప్రతి బంతి 140కి పైగా స్పీడ్ తో వేశాడు. 149 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి కూడా ఉంది. అంటే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు మయాంక్ యాదవ్ (Mayank Yadav). ఈ క్రమంలోనే తడబడ్డ జింబాబ్వే బ్యాటర్లు వికెట్ సమర్పించుకున్నారు. అయితే జింబాబ్వే పైన అద్భుతంగా రాణించిన మయాంక్ యాదవ్ పైన సంచలన ఆరోపణలు చేశారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar). ప్రతి బంతి 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వేస్తున్న మయాంక్ యాదవ్ స్పీడు పైన తనకు అనుమానాలు ఉన్నట్లు బాంబు పేల్చారు. వెంటనే మయాంక్ యాదవ్ కు డోపింగ్ టెస్టులు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఐసీసీ రంగంలోకి దిగి… అతని స్పీడు, ఫిట్నెస్ గురించి టెస్టులు చేయాలని కోరారు. అప్పుడే అతని స్పీడును తాను నమ్మగలుగుతానని వివరించారు. అందులో క్లీన్ చీట్ ఉంటే మయాంక్ రియల్ హీరో అవుతాడని తెలిపారు.

ఇంత ఆవేశం ప‌నికిరాదు.. తేడా వ‌స్తే, మ‌ళ్లీ షెడ్డుకు వెళ్లాల్సిందే

మయాంక్ యాదవ్ పై విమర్శలు చేసిన షోయబ్ అక్తర్ అదే సమయంలో కీలక సూచనలు కూడా చేశారు. జింబాబ్వే పై ఆడిన మయాంక్ యాదవ్ చేతి స్పీడ్ అద్భుతంగా ఉందన్నారు. చేతుల ద్వారా వేగాన్ని ప్రొడ్యూస్ చేసి అదరగొడుతున్నాడని తెలిపారు. ఇలాంటి బౌలర్ దొరకడం టీమిండియా అదృష్టం అని ప్రశంసించారు. అయితే ఫిట్నెస్ తోపాటు బౌలింగ్ రిధం పైన మయాంక్ యాదవ్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరారు. అప్పుడే పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాడని వెల్లడించారు. లేకపోతే ప్రతి బంతి ఇలా స్పీడ్ గా వేస్తూ వెళ్తే… మయాంక్ షెడ్డు కు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు.

Advertisement

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

Related News

న‌న్ను కొనేందుకు ఫిక్స‌ర్ వ‌స్తే..హోట‌ల్ రూంలోనే చిత‌క‌బాదాను

టీమిండియాకు ప్లాట్ పిచ్ లు..పాకిస్తాన్ కు క‌ఠిన‌మైన పిచ్ లా ? ఇంగ్లండ్ పై ఫైర్‌

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !

2017లో విరాట్ కోహ్లీని చూసి ప్యాంట్ త‌డుపుకున్నా..అమీర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

Big Stories

Advertisement
×