E-Paper
Advertisement

నాతో పనిచేసిన వాళ్లందరూ మంత్రులయ్యారు – బాబీ డియోల్ ఊహించని కామెంట్స్!

నాతో పనిచేసిన వాళ్లందరూ మంత్రులయ్యారు – బాబీ డియోల్ ఊహించని కామెంట్స్!
Advertisement

Bobby Deol: ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణ నటుడిగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన.. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలలో విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్న ఈయన.. ఇప్పటికే బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్ర పోషించి మెప్పించిన విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన మాట్లాడుతూ.. తనతో పని చేసిన వాళ్లందరూ కూడా మంత్రులయ్యారు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నాతో పని చేసిన వాళ్లంతా మంత్రులయ్యారు – బాబీ డియోల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జన నాయగన్. దాదాపు 7 నెలల పాటు సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నేడు థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రముఖ నటుడు బాబీ డియోల్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. “విజయ్ కి ఎక్కువగా ప్రచారం చేసుకోవడం నచ్చదు. ఇక నాది కూడా అదే స్వభావమే.. కాకపోతే నాతో కలిసి పని చేసిన వాళ్లంతా కూడా మంత్రులయ్యారు. నేను బాలకృష్ణ తో కలిసి డాకు మహారాజ్ సినిమాలో నటించాను. ఆయన చాలా కాలంగానే రాజకీయాల్లో ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించి హ్యాట్రిక్ అందుకున్నారు.

Advertisement

హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాను. ఇక ఆయన మంత్రి మాత్రమే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇక ఇప్పుడు విజయ్ తో కలిసి జననాయగన్ సినిమాలో నటించాను. ఆయన ఏకంగా ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు అంటూ చమత్కరించారు. ఇకపోతే ఈయన సూర్యతో కలిసి నటించిన కంగువా సినిమా మంచి విజయాన్ని అందుకోకపోయినా ఆయనతో కలిసి పనిచేయడం ఒక అనుభవంగా మిగిలింది అంటూ గుర్తు చేసుకున్నారు. ఇక మొత్తానికైతే బాబీ డియోల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అన్ని మాటలు మాట్లాడిన బాబీ డియోల్ చివర్లో తాను ఇదంతా కేవలం సరదాగా చేసిన వ్యాఖ్యలే అంటూ తెలిపారు.

ALSO READ:1000 ఇంజెక్షన్లు.. 5సార్లు ఐవీఎఫ్.. నరకం అనుభవించానంటున్న ప్రముఖ నటి!

బాబి డియోల్ కెరియర్..

Advertisement

బాబి డియోల్ విషయానికి వస్తే.. దివంగత నటుడు ధర్మేంద్ర చిన్న కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ధరమ్ వీర్ అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను పలకరించారు. 1995లో బర్సాత్ అనే చిత్రంలో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పైగా ఈ చిత్రానికి ఉత్తమ పురుష తొలి అరంగేట్రం విభాగంలో ఫిలింఫేర్ అవార్డు లభించింది. ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఈయన అప్పటినుంచి విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Related News

ముద్దు సీన్ ఉంటే అడల్ట్ సినిమా అవుతుందా? ట్రోలర్స్ కు నాగ వంశీ కౌంటర్!

ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య

నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

బోయపాటి సెంటిమెంట్‌కు తమిళ బ్రదర్స్ నో?

త్రిషకు అండగా కంగనా.. ఉదయ్ నిధి స్టాలిన్ కు గట్టి కౌంటర్!

మరో మల్టీప్లెక్స్ ప్లానింగ్ లో రౌడీ హీరో..విస్తరిస్తున్న సినీ సామ్రాజ్యం!

ఢిల్లీ భవన ప్రమాదంపై సోనూసూద్ డిమాండ్!

కైపెక్కించే ఫోజులతో విష్ణుప్రియ కిర్రాక్ లుక్.. ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×