E-Paper
Advertisement

Chinmayi: మగాళ్లు కాదు.. మానవ మృగాలు నిధి అగర్వాల్ విషయంలో ఫైర్ అయిన చిన్మయి!

Chinmayi: మగాళ్లు కాదు.. మానవ మృగాలు నిధి అగర్వాల్ విషయంలో ఫైర్ అయిన చిన్మయి!
Advertisement

Chinmayi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా మంచి సక్సెస్ అందుకున్న చిన్మయి(Chinmayi) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె మహిళల గురించి చేసే పోస్టుల కారణంగా పలువురు ఈమెపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే చిన్మయి పట్ల ఆమె పిల్లల పట్ల కొంతమంది దారుణమైన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయటం, చిన్మయి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా తనని టార్గెట్ చేసిన వారి పట్ల ఈమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా చిన్మయి మరో సారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఈసారి ఈమె హీరోయిన్ నిధిఅగర్వాల్ (Nidhhi Agerwal) పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు.

నిధి అగర్వాల్ కు చేదు అనుభవం..

నిధి అగర్వాల్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్(The Raja Saab) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు .హైదరాబాదులోని లులూ మాల్ లో ఈ సాంగ్ లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం నిధి అగర్వాల్ తిరిగి వెళుతుండగా ఒక్కసారిగా అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడి తనని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానుల చర్యలను చాలామంది తప్పుపడుతున్నారు.

వేరే గ్రహంలో ఉంచాలి..

Advertisement

ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి సైతం ఈ వీడియో పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్ నిధి అగర్వాల్ విషయంలో ఇలా జరగడం చాలా దారుణమని తెలిపారు. హైనాల కంటే కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారని నిజంగా వాటిని కూడా అవమానించేలా మనుషులు ప్రవర్తించారని తెలిపారు.. ఓకే మనస్తత్వం ఉన్న మగాళ్ళందరిని గుంపుగా కలిపితేనే ఇలా స్త్రీల పట్ల దారుణంగా వ్యవహరిస్తారని ఇలాంటి మానవ మృగాలను తీసుకెళ్లి వేరే గ్రహంలో పెట్టాలి అంటూ ఈమె తనదైన శైలిలోనే ఈ ఘటనపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఇలా చిన్మయి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్మయి చేసిన ఈ పోస్టుపై అభిమానులు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. నిజంగా హీరోయిన్ విషయంలో ప్రవర్తించిన తీరును తప్పుపడుతున్నారు. అభిమానం అనే పేరుతో ఇలా ఇబ్బందులకు గురి చేయటం సరైనది కాదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిధి అగర్వాల్ ఎంతో అసౌకర్యానికి గురి అయ్యారు. చివరికి ఆమె సెక్యూరిటీ అభిమానులు అందరినీ పక్కకు నెట్టి ఆమెను సురక్షితంగా కారులోకి ఎక్కించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×