E-Paper
Advertisement

Dwcra Groups: సంక్రాంతి సందడిలో డ్వాక్రా సంఘాల మహిళలు.. ఖాతాల్లో రూ.15 వేలు, ఖాతాలు చెక్ చేసుకోండి

Dwcra Groups: సంక్రాంతి సందడిలో డ్వాక్రా సంఘాల మహిళలు.. ఖాతాల్లో రూ.15 వేలు, ఖాతాలు చెక్ చేసుకోండి
Advertisement

Dwcra Groups: సంక్రాంతికి మూడు వారాలకు ముందు ఏపీలోని డ్వాక్రా సంఘాల మహిళలు ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. డ్వాక్రా సంఘాల మహిళలకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. రెండు వేల డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేసింది. ఒక్కో గ్రూప్ కు రూ.15 వేలు చొప్పున నిధులు మంజూరు విడుదల చేసింది. వీటిని ఆయా మహిళలు తిరిగి కట్టాల్సిన పని లేదు. ఆ రుణాల వల్ల సంఘం నిధి పెరిగి, బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు వీలవుతుంది.

సంక్రాంతి సందడిలో డ్వాక్రా సంఘాల మహిళలు

Advertisement

ఏపీలో డ్వాక్రా సంఘాల బలోపేతానికి కూటమి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మహిళలకు ఆర్థికంగా బలపడేందుకు రకరకాల పథకాలు అమలు చేస్తోంది. వారి అకౌంట్లో నేరుగా నిధులు విడుదల చేస్తోంది.  తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తోంది. వారితోపాటు వారి పిల్లల చదువులకు ఆర్థిక సహకారాలు అందజేస్తోంది.

ఈ క్రమంలోనే డ్వాక్రా సంఘాల మహిళలకు తీపి కబురు చెప్పేసింది. రివాల్వింగ్ ఫండ్ కింద ఆయా సంఘాలకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. కొన్నాళ్లుగా రివాల్వింగ్ ఫండ్ విధానం అమలు కాలేదు. ఇప్పుడు మళ్లీ దీన్ని పునరుద్ధరించింది. ఇంతకీ రివాల్వింగ్ ఫండ్ ఉద్దేశం ఏంటి? ఎవరికి పనికొస్తుంది?

Advertisement

ఖాతాల్లో రూ.15 వేలు,  ఇంకెందుకు ఆలస్యం

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ నిధులు అందనున్నాయి. ఒక్కో సంఘానికి 15 వేల రూపాయలు చొప్పున ఆయా గ్రూపుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సహాయం కొత్త డ్వాక్రా సంఘాల వారికి మాత్రమే.

గతేడాది ఆగస్టు 2 నుంచి ఈ ఏడాది నవంబర్ 30 మధ్యకాలంలో కొత్తగా ఏర్పాటైన సంఘాలకు మాత్రమే. ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత సంఘాల గ్రూపులకు వర్తించదు. కొత్తగా ఏర్పడిన సంఘాల మహిళలను ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.

ALSO READ:  మీడియాకు సజ్జల మసాలా.. నేతలు గరం గరం

రివాల్వింగ్ ఫండ్‌కు ప్రత్యేకత ఏమిటంటే డ్వాక్రా సంఘాలు ఈ నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం గ్రూప్ ఖాతాలో ఉంటుంది. దీనివల్ల సంఘాలకు ఆర్థిక బలం చేకూరుతుంది. బ్యాంకుల వద్ద క్రెడిట్ విలువ మెరుగుపడుతుంది. ఫ్యూచర్‌లో రుణాలు పొందేందుకు ఇది మొదటి మెట్టు మాత్రమే. దీనిద్వారా ఎక్కువ మంది సభ్యులు రుణాలు తీసుకునే అవకాశం ఉంది.

వాటి ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. దానికి ఉపాధి మెరుగుపడుతుంది. దీనికితోడు జనవరి నుంచి ఉన్నతి 2.0 స్కీమ్ అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి రాయితీ రుణాలను అందించనుంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశం.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×