E-Paper
Advertisement

Chinmayi Sripada: చీర కట్టుకున్న అమ్మాయి పరిస్థితి ఇదే.. ఆ వీడియో పెట్టి మరీ చిన్మయి చిందులు

Chinmayi Sripada: చీర కట్టుకున్న అమ్మాయి పరిస్థితి ఇదే.. ఆ వీడియో పెట్టి మరీ చిన్మయి చిందులు
Advertisement

Chinmayi Sripada: ‘దండోరా’ సినిమా వేడుకలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఈవెంట్‌లో మాట్లాడిన శివాజీ.. సెలబ్రిటీలు ముఖ్యంగా మహిళలు వేసుకునే దుస్తులపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. మహిళలు సంప్రదాయబద్ధమైన దుస్తులు..ముఖ్యంగా చీరలు ధరిస్తే సమాజం నుంచి గౌరవం లభిస్తుందని అన్నారు. శరీరాకృతి కనిపించేలా బట్టలు వేసుకోవడం సభ్యత కాదని..మహిళలు ప్రకృతి స్వరూపులని, వారు గౌరవంగా ఉంటేనే సమాజం నుంచి మర్యాద వస్తుందని చెప్పారు. ఆయన మాటల తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఆయన ఉద్దేశం సరైనదే అని మరి కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు.

అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. చాలామంది సెలబ్రిటీలు కూడా.. శివాజీ అభిప్రాయాలను వ్యతిరేకించారు. ముఖ్యంగా గాయని చిన్మయి శ్రీపాద ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని.. గత కొద్దిరోజులుగా ఈ విషయం పైన ఎన్నో పోస్టులు పెడుతున్నారు. మహిళల దుస్తులే పురుషుల ప్రవర్తనకు కారణమన్న భావన పూర్తిగా తప్పని ఆమె పేర్కొన్నారు. మహిళలు ఏ దుస్తులు వేసుకున్నా గౌరవం లభించాల్సిందేనని స్పష్టం చేశారు.

Advertisement

ఈ నేపథ్యంలో చిన్మయి మరో ట్వీట్ కూడా షేర్ చేశారు. “మహిళలు పూర్తిగా కప్పుకున్న చీర వేసుకుంటే గౌరవం వస్తుందని మనకు చెప్పారు. కానీ వాస్తవంలో పరిస్థితి ఎలా ఉందో చూడండి” అంటూ ఆమె పేర్కొన్నారు. ఒక టీవీ షోలో చక్కగా చీర కట్టుకున్న ఓ మహిళ వీడియోను షేర్ చేస్తూ.. ఆ వీడియో కింద వచ్చిన అనేక అసభ్యకరమైన కామెంట్లను చూపించారు. చీర వేసుకున్నా కూడా మహిళలపై ఇలాంటి చెడ్డ వ్యాఖ్యలు వస్తున్నాయంటే..అసలు సమస్య దుస్తుల్లో కాదు..ఆలోచనల్లోనే ఉందని ఆమె అర్థం చేయాలనుకున్నారు.

ALSO READ: Chinmayi : శివాజీ Incel Boy.. చిన్మయి వాడిన ఈ పదం అంత పచ్చి బూతా..?

Advertisement

మహిళలు ఏ దుస్తులు వేసుకున్నా, వారికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత సమాజానిదే. దుస్తుల ఆధారంగా మహిళల గౌరవాన్ని నిర్ణయించడం సరికాదు. పురుషుల ప్రవర్తనకు మహిళల దుస్తులే కారణమని చెప్పడం తప్పు ఆలోచన. నిజంగా మారాల్సింది దుస్తులు కాదు..మన మనస్తత్వం. మహిళలపై వస్తున్న అసభ్య వ్యాఖ్యలను ప్రశ్నించాలి, తప్పు చేసే వారిని నిలదీయాలి. అప్పుడే సమాజంలో నిజమైన మార్పు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని చిన్మయి చాలాసార్లు తన పోస్టుల ద్వారా తెలపదానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ వీడియో ద్వారా కూడా మరోసారి అదే తెలిపింది ఈ సెలబ్రిటీ.

మరోపక్క శివాజీ చేసిన వ్యాఖ్యలపై చిన్మయి మాత్రమే కాకుండా అనసూయ లాంటి వాళ్లు కూడా కొంచెం గట్టిగానే స్పందించారు. అయితే ఇవన్నీ ఇక్కడితో ఆపమని ఈమధ్య శివాజీ స్వయంగా మీడియా ముందుకి వచ్చి తెలియజేశారు. మహిళా కమిషనర్ ముందు హాజరై క్షమాపణలు కూడా కోరారు. కానీ ఇంకా కూడా ఈ విషయానికి శుభం కార్డు పడలేదు. చిన్మయి మరోసారి ఇలాంటి వీడియో షేర్ చేయడంతో.. ఈ విషయాన్ని ఇంకా ఎంత లాగుతారో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

 

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×