E-Paper
Advertisement

Renault Cars Price Hike: రెనాల్ట్ కీలక ప్రకటన.. ఆ మూడు మోడల్స్ పై ధరల పెంపు!

Renault Cars Price Hike: రెనాల్ట్ కీలక ప్రకటన.. ఆ మూడు మోడల్స్ పై ధరల పెంపు!

Renault Cars Price Hike: దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆటో మేకర్ కంపెనీలు ధరల పెంపు గురించి కీలక ప్రకటన చేయగా, ఇప్పుడు ఆ లిస్టులో రెనాల్ట్ ఇండియా కూడా చేరింది. జనవరి 1, 2026 నుంచి తమ కంపెనీకి చెందిన అన్ని మోడల్ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇన్‌ పుట్ కాస్ట్స్ పెరగడం, కరెన్సీ ఎక్స్‌ ఛేంజ్ రేట్స్ ఫ్లక్చుయేషన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆయా కార్ల మీద సుమారు 2% వరకు ధరల పెంపు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇది మోడల్, వేరియంట్ ప్రకారం వేరువేరుగా ఉంటుందని తెలిపింది.

ప్రస్తుతం రెనాల్ట్ ఇండియా లైనప్‌ లో మూడు మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి క్విడ్, మరొకటి ట్రైబర్, ఇంకొకటి కిగర్. కచ్చితమైన మోడల్ వైజ్ బ్రేక్‌ డౌన్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు, కానీ, ధరల పెంపుపై ఆటో నిపుణులు కీలక అంచనాలు వేస్తున్నారు. ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ఆధారంగా ధరలు ఇలా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ధరల పెంపు వివరాలు

రెనాల్ట్ కార్లకు సంబంధించిన ధరల పెంపు సుమారు 2%  వరకు ఉంటుందని ఆటో మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రెనాల్స్ ఇండియా కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న క్విడ్, ట్రైబర్, కిగర్ వేరియంట్లు ధరల పెంపునకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇన్‌ పుట్ కాస్ట్స్ పెరగడం, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్, ఇతర ఫ్యాక్టర్ల కారణంగా ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. GST 2.0 తర్వాత ధరలు తగ్గినప్పటికీ, ఈ పెంపు తర్వాత కూడా మోడల్స్ కాంపిటిటివ్‌గా ఉంటాయి. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు అదనపు ధరతో అందుబాటులో ఉండనున్నాయి.

మోడల్ వైజ్ ధరలు (అంచనా)

⦿ క్విడ్: ఈ కారు ధర రూ. 4.30 లక్షల నుంచి రూ.5.88 లక్షలు ఉంది. ధర పెరిగిన తర్వాత రూ.4.38 లక్షల నుంచి రూ. 6.00 లక్షలకు పెరగనుంది.

⦿ ట్రైబర్: ప్రస్తుతం  ఈ కారు ధర రూ. 5.76 లక్షల నుంచి రూ.  8.39 లక్షలుగా ఉంది. ధరలు పెరిగిన తర్వాత రూ. 5.88 లక్షల నుంచి రూ. 8.55 లక్షల వరకు ఉంటుంది.

⦿ కిగర్: ప్రస్తుతం ఈ కారు ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 10.34 లక్షలు ఉంది. ధర పెరిగిన తర్వాత రూ. 5.88 లక్షల నుంచి రూ. 10.54 లక్షలకు పెరగనుంది.

ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు (ఢిల్లీ) మాత్రమే. కచ్చితమైన పెంపు మోడల్, వేరియంట్ ప్రకారం మారవచ్చు. త్వరలోనే రెనాల్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంజి మోటార్, నిస్సాన్ సహా పలు కంపెనీలు ధర పెంపును ప్రకటించాయి.

రెనాల్ట్ ఇండియా గురించి..

ఇక ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ కు దేశంలో విస్తృతమైన మార్కెట్ ఉంది. దాదాపు 350 సేల్స్ అవుట్‌ లెట్లు, 450 కి పైగా సర్వీస్ టచ్ పాయింట్లు ఉన్నాయి. ఈ నెట్‌ వర్క్‌ లో 250 కి పైగా వర్క్‌ షాప్ ఆన్ వీల్స్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాల్లో సర్వీసును అందిస్తున్నాయి.

Read Also:  హ్యుందాయ్ ప్రైమ్ టాక్సీ రేంజ్.. ఈ కారు ఆ అవసరాలకు బెస్ట్ బ్రో!

Related News

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

Big Stories

×