E-Paper
Advertisement

MSVPG Shooting updates: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ అప్డేట్.. వెంకీ సీన్ ఫినిష్..

MSVPG Shooting updates: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’  షూటింగ్ అప్డేట్.. వెంకీ సీన్ ఫినిష్..
Advertisement

MSVPG Shooting updates: టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్ట్రార్ హీరోల సినిమాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ కూడా వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు వచ్చేఏడాది సంక్రాంతికి డేట్ ని లాక్ చేసుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో షూటింగ్ పెండింగ్ ఉన్న సినిమాలు త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి.. సంక్రాంతి బరిలో దిగబోతున్న సినిమాల్లో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు ఒకటి. ఈ మూవీ షూటింగ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

చిరంజీవి – మన శంకర వరప్రసాద్ గారు.. 

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ యంగ్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీకి ఇటీవలే టైటిల్ ని ఫిక్స్ చేస్తారు. మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మీసాల పిల్ల పాట జనాల్లో బాగా ట్రెండ్ అవుతుంది. వచ్చే జనవరిలో మెగాస్టార్ చిరంజీవికి మంచి హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని తెలుస్తుంది.. ప్రస్తుతం కీలక సీన్లను పూర్తి చేసే పనిలో అనిల్ రావిపూడి ఉన్నారు.

 వెంకటేష్ – కేథరిన్ మ్యారేజ్ సీన్.. 

Advertisement

చిరు మూవీలో వెంకీ మామ కూడా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.. వెంకటేష్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఓ పబ్ సాంగ్ ఉండనుంది. అందులోచిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది.. ఈ సాంగ్ షూటింగ్ వచ్చే నెలలో పూర్తి చెయ్యనున్నారు. ప్రస్తుతం వెంకీ మామా, బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్ మ్యారేజ్ సీన్ ని పూర్తి చేశారు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది. అతి త్వరలోనే పబ్ సాంగ్ ను పూర్తి చేసి ప్రమోషన్స్ ను మొదలు పెట్టే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నారట.. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చినా మీసాల పిల్ల సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మిలియన్స్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉన్న ఈ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అదేవిధంగా చిరు వెంకీ కాంబినేషన్లో రాబోతున్న పబ్ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని డైరెక్టర్ అంటున్నారు. మరి ఈ మూవీ చిరుకు ఎలాంటి రికార్డులను అందిస్తుందో చూడాలి..

Also Read :మీనాతో క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? బ్రదర్ మాత్రం కాదు..

వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×