E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: దొంగతనం చేసి అడ్డంగా బుక్కైన తనూజా, రీతూ… బిగ్ బాస్ తోనే ఆటలా?

Bigg Boss 9 Telugu: దొంగతనం చేసి అడ్డంగా బుక్కైన తనూజా, రీతూ… బిగ్ బాస్ తోనే ఆటలా?
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ డే 81 ఎపిసోడ్లో ఎక్స్ కంటెస్టెంట్ సోహెల్ ఎంట్రీ హైలెట్ గా నిలిచింది. బిగ్ బాస్ ను డిమాండ్ చేస్తూనే కాళ్ళు పట్టుకుంటానని వేడుకున్న సోహెల్ ఒక వైపు, ఆయన తెప్పించిన లగ్జరీ ఐటమ్స్ దొంగతనం రచ్చ మరోవైపు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ దొంగతనం చేసిన దొంగలకు బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ సూపర్ గా ఉంది.

కాఫీని దొంగిలించిన కెప్టెన్ 

సోహెల్ బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేసి పాలు, చికెన్, కాఫీ పొడిని హౌస్ మేట్స్ కోసం తెప్పించిన సంగతి తెలిసిందే. ముందుగా సోహెల్ ను డూప్లికేట్ పేపర్ ప్రోడక్ట్స్ తో ఆట పట్టించారు బిగ్ బాస్. పరువు తీస్తున్నావ్ బిగ్ బాస్. కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ పంపించు అని రిక్వెస్ట్ చేయడంతో.. బిగ్ బాస్ దిగొచ్చి సోహెల్ అడిగినట్టే చికెన్, పాలు, కాఫీ పవర్ ను పంపారు. స్టోర్ రూమ్ బెల్ మోగగానే కెప్టెన్ రీతూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సోహెల్ వస్తే నేను తీసుకొస్తాలే వెళ్ళు అని నచ్చజెప్పింది. అంతలోనే తనుజా రావడంతో కాఫీ పొడిని ఇచ్చి దాచమని చెప్పింది. చికెన్ వచ్చిన ఆనందంలో హౌస్ మేట్స్ ఇదేమీ పట్టించుకోలేదు. వీళ్ళు ఇటువైపు చికెన్ చికెన్ మటన్ మటన్ అని గెంతులు వేస్తుంటే.. మరోవైపు తనూజ, రీతూ కలిసి కెప్టెన్ రూమ్ లో దిండు కింద కాఫీ పొడిని దాచుకున్నారు.

 అడ్డంగా ఇరికించిన బిగ్ బాస్ 

Advertisement

అయితే తనుజా ఏమీ ఎరుగనట్టు కాఫీ పొడి రాలేదని సోహెల్ ను అడిగింది. అంతలోనే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.  ‘సోహెల్ కాఫీ పొడి కావాలా ?’ అని అడిగారు. వెంటనే ‘అవును బిగ్ బాస్’ అని సోహెల్ అనడంతో… “కెప్టెన్ రూమ్ లో బెడ్ మీద పిల్లో కింద కాఫీ పొడి పడి ఉంది. వెళ్ళి తెచ్చుకుని కాఫీని ఎంజాయ్ చేయండి” అని తనూజ, రీతూల గుట్టు రట్టు చేశాడు బిగ్ బాస్. దీంతో ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆ కాఫీ పొడిని రీతూ, తనూజ నుంచి లాగేసుకున్నారు. తరువాత టాస్క్ లో కూడా ఆద్యంతం తన కామెడీ టైమింగ్ తో తెగ నవ్వించాడు. కావాలనే తాను ఓడిపోయి, రీతూ, సంజనలను గెలిపించాడు. అలా సోహెల్ ఉన్నంతసేపు హౌస్ లో ఫుల్ ఫన్ చోటు చేసుకుంది.

మరోవైపు సంజన కూడా భరణి ట్యాబ్లెట్స్ తీసి దాచి పెట్టింది. ఆమె ఈ ట్యాబ్లెట్స్ దొంగతనంతో 1 గంట ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసింది. కానీ అది బ్యాక్ ఫైర్ అయ్యింది. భరణి సీరియస్ అవ్వడం, దివ్య ఏడవడం, ఇమ్మూ కోప్పడడంతో సంజన తానే ఆ ట్యాబ్లెట్స్ ను తీసి భరణికి ఇచ్చేసింది.

Advertisement

Read Also : తనూజా తన్మయత్వంలో యావర్… గేమ్ లో బొక్క బోర్లా పడ్డ ఇమ్మూ… సోహెల్ తో బిగ్ బాస్ ఆటలు

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×