E-Paper
Advertisement

OTT Movie: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సరికొత్త సినిమాలు… ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

OTT Movie: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సరికొత్త  సినిమాలు… ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

OTT Movie : ఈ శుక్రవారం (2025 నవంబర్ 28) ఓటీటీలో ఫుల్ యాక్షన్, థ్రిల్, మిస్టరీ మిక్స్ వచ్చేస్తున్నాయి. వీకెండ్ ప్లాన్ పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక్క సారి చూస్తే వదలాడకుండా కంటిన్యూ చేస్తుంటారు. థియేటర్లలో ఈ సినిమాలు చూడలేని వాళ్ళు పాప్ కార్న్ పక్కన పెట్టుకుని చూసేయండి. ఇందులో విష్ణు విశాల్ క్రైమ్ థ్రిల్లర్ ‘అర్యన్’ నుంచి డైనోసార్స్‌ యాక్షన్ సీన్స్ తో అదరగొడుతున్న ‘ప్రిమిటివ్ వార్’ కూడా రచ్చ చేస్తుంది. ‘ది పెట్ డిటెక్టివ్ లో షరఫ్, అనుపమ పరమేశ్వరన్ కామెడీకి పొట్ట చెక్కలే అవుతుంది. ఈ సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే వివరాలపై ఓ లుక్ వేయండి.

1. ‘అర్యన్’ (Aaryan)

ప్రవీణ్. కె డైరెక్ట్ చేసిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, సెల్వరాఘవన్ లీడ్ రోల్స్ లో నటించారు. . థియేటర్లలో ఆక్టోబర్ 31కి రిలీజ్ అయిన ఈ సినిమా, ఈ శుక్రవారం (నవంబర్ 28) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కథ అత్రేయ అనే రైటర్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక లైవ్ టీవీ షోలో 5 రోజుల్లో 5 మందిని చంపేస్తా అని చెప్పి, అక్కడే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. మరుసటి రోజు ఒక పాలిటీషియన్ చనిపోతాడు. ప్రతి రోజు ఒక విక్టిమ్ పేరు టీవీలో వస్తుంది. నంది (విష్ణు విశాల్) ఈ హత్యలను ఆపడానికి తీవ్రంగా పోరాడతాడు. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 28 నుంచి తమిళ, తెలుగు, హిందీ డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతోంది.

2. ‘ప్రిమిటివ్ వార్’ (Primitive War)

Advertisement

లూక్ స్పార్క్ డైరెక్ట్ చేసిన ఈ అస్ట్రేలియన్ సై-ఫై యాక్షన్ హారర్ లో ర్యాన్ క్వాంటెన్, ట్రిషియా హెల్ఫర్ లీడ్ రోల్స్ లో నటించారు. 1968 వయనాం యుద్ధంలో మిస్సింగ్ అయిన గ్రీన్ బెరెట్ ప్లాటూన్ వెతకడానికి, ఒక స్క్వాడ్ ఒక ఐసోలేటెడ్ జంగిల్ వ్యాలీకి వెళ్తుంది. అక్కడ డైనోసార్స్ దాడి మొదలవుతుంది. ఇందులో యాక్షన్ సీన్స్, డైనోసార్స్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. జురాసిక్ పార్క్ ని చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇది Lionsgate Playలో నవంబర్ 28 నుంచి అందుబాటులో ఉంది.

3. ‘రక్తబీజ్ 2’ (Raktabeej 2)

నందితా రాయ్ దర్శకత్వంలో అబిర్ చటర్జీ, మిమి చక్రబర్తి, అంకుష్ హజ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2023 లో వచ్చిన రక్తబీజ్ మూవీకి సీక్వల్. ఈ స్టోరీ ఇండియా-బంగ్లాదేశ్ మధ్య టెర్రర్, యాక్షన్ సీన్స్, పాలిటికల్ ట్విస్ట్‌లతో ఉత్కంఠంగా నడుస్తుంది. ఇది ZEE5లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

4. ‘లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్’ (Left Handed Girl)

Advertisement

ఈ తైవాన్ ఫ్యామిలీ డ్రామా చింగ్ సౌ డైరెక్షన్ లో వచ్చింది. ఇందులో జానెల్ ట్సాయ్ (షు-ఫెన్), నినా యే (ఇ-జింగ్) మెయిన్ పాత్రల్లో ఉన్నారు. ఈ కథ ఎడమ చేతి వాటం ఉన్న వకా అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ చిన్న సమస్యతో స్టోరీ పెద్ద టర్న్ తీసుకుంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 28 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

5. ‘ది పెట్ డిటెక్టివ్’ (The Pet Detective)

ప్రనీష్ విజయన్ డైరెక్టర్. షరఫ్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటించారు. టోనీ అనే డిటెక్టివ్, కైకేయి అనే అమ్మాయి ప్రేమలో పడి, ఒక పెట్ కేసు తీసుకుంటాడు. కానీ అది ఇంటర్నేషనల్ మాఫియాకి కనెక్ట్ అవుతుంది. యక్షన్, కామెడీ అదిరిపోయాయి. ఇది ZEE5లో నవంబర్ 28 నుంచి మలయాళం, తెలుగు డబ్బింగ్ తో అందుబాటులో ఉంది.

Related News

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

Big Stories

Advertisement
×