E-Paper
Advertisement

చిరంజీవి ‘మెగా158’ ప్రాజెక్ట్‌లోకి థమన్ ఎంట్రీ.. ఓపెనింగ్‌కు చీఫ్ గెస్ట్‌ ఎవరంటే?

చిరంజీవి ‘మెగా158’ ప్రాజెక్ట్‌లోకి థమన్ ఎంట్రీ.. ఓపెనింగ్‌కు చీఫ్ గెస్ట్‌ ఎవరంటే?
Advertisement

Mega 158: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకుల్లో పూనకాలు వస్తాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆ సినిమా తర్వాత, ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ టీమ్ వరుస క్రేజీ అప్‌డేట్స్‌తో సర్‌ప్రైజ్ చేసింది.

Read also-తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా!.. కారణం ఏంటంటే?

మే 21న పూజా…

Advertisement

చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం (Mega 158) మే 21, 2026 న అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘వాల్తేరు వీరయ్య’ను మించిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో బాబి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌ను, ఆయన నటనను సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు దర్శకుడు పూర్తిస్థాయిలో కసరత్తులు పూర్తి చేశారు.

థమన్ ఎంట్రీ..

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుడు బాబి కొల్లి మరో బిగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించబోతున్నారు. గతంలో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాకు థమన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇప్పుడు బాబి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు థమన్ అదిరిపోయే బీట్స్, ఊరమాస్ సాంగ్స్ తో తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్ టీమ్ అంతా సెట్ అయిపోయింది.

Advertisement

Read also-బాలయ్య బాబు ‘NBK111’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్‌గా మంచు మనోజ్..

ముఖ్య అతిథిగా

ఈ సినిమా ఓపెనింగ్ వేడుకకు సంబంధించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సరికొత్త వార్త ఏమిటంటే.. ఈ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. అన్నయ్య చిరంజీవి సినిమా ముహూర్తపు షాట్‌కు తమ్ముడు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టబోతున్నారనే వార్త మెగా అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతోంది. ఏదేమైనా, మే 21న జరగబోయే ‘మెగా 158’ ఓపెనింగ్ వేడుక టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులకు, మెగా పండగకు వేదిక కాబోతోందని స్పష్టమవుతోంది. రేపు జరగబోయే పూజా కార్యక్రమం తర్వాత సినిమా గురించి మరిన్ని వివరాలు తిలియనున్నాయి.

Related News

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా!.. కారణం ఏంటంటే?

బాలయ్య బాబు ‘NBK111’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్‌గా మంచు మనోజ్..

సమాజ సేవలో యువ నటుడు సంజోష్.. స్కాలర్‌షిప్స్ పంపిణీ!

‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్!’.. ఎన్టీఆర్‌పై అల్లు అర్జున్ క్రేజీ ట్వీట్..

టాలీవుడ్ ‘రాక్ స్టార్’ మంచు మనోజ్ బర్త్‌డే స్పెషల్.. నెపోటిజం నుంచి బయటకు వచ్చి..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన డైరెక్టర్ .. మళ్ళీ అదే ఫార్మాట్ లో గ్లింప్స్..

తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా షురూ.. దర్శకుడిగా కంఠంనేని రవిశంకర్!

Big Stories

Advertisement
×