E-Paper
Advertisement

ఎండాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుందా? ఈ సింపుల్ టిప్స్‌తో చల్లబరచండి!

ఎండాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుందా? ఈ సింపుల్ టిప్స్‌తో చల్లబరచండి!
Advertisement

Phone Heating: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు మనుషులమే కాదు, మన చేతుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్లు కూడా విలవిలలాడిపోతుంటాయి. కాసేపు ఫోన్ మాట్లాడినా, రీల్స్ చూసినా లేదా కాస్త హెవీ గేమ్స్ ఆడినా ఫోన్ నిప్పుల కొలిమిలా మారిపోతుంది. ఫోన్ విపరీతంగా వేడెక్కడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడమే కాకుండా, ఒక్కోసారి ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి ఈ వేసవిలో మీ ఫోన్‌ను కూల్‌గా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read also-Anshu Reddy : బ్లాక్ లెహంగాలో మెస్మరైజ్ చేస్తున్న అన్షు.. పిక్స్ వైరల్..

ఎండ తగలకుండా..

Advertisement

మనం చేసే అతిపెద్ద తప్పు ఫోన్‌ను నేరుగా సూర్యరశ్మి తగిలేలా ఉంచడం. బైక్ నడుపుతున్నప్పుడు మొబైల్ హోల్డర్లలో పెట్టడం, కారు డాష్‌బోర్డ్‌పై వదిలేయడం, లేదా కిటికీల పక్కన పెట్టడం వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. కాబట్టి ఫోన్‌ను వీలైనంత వరకు నీడన లేదా చల్లని ప్రదేశాలలో ఉంచండి.

బ్యాక్ కేస్‌లు తొలగించండి
మనం ఫోన్ రక్షణ కోసం వాడే లావుపాటి ప్లాస్టిక్ లేదా రబ్బర్ కేస్‌లు ఎండాకాలంలో శాపంగా మారుతాయి. ఫోన్ లోపల ఉత్పత్తయ్యే వేడి బయటకు పోకుండా ఈ కేస్‌లు అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు లేదా గేమింగ్ ఆడేటప్పుడు బ్యాక్ కవర్‌ను తీసేయడం చాలా మంచిది.

ఛార్జింగ్ పెట్టేటప్పుడు..

Advertisement

వాడకం ఆపండి: ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా ఇంటర్నెట్ వాడటం అస్సలు చేయకూడదు. దీనివల్ల బ్యాటరీపై డబుల్ ప్రెజర్ పడి వేడి రెట్టింపు అవుతుంది.

కంపెనీ ఛార్జర్‌నే వాడండి: ఏది పడితే ఆ ఛార్జర్ కాకుండా, మీ ఫోన్ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్‌ను మాత్రమే వాడండి.

సర్‌ఫేస్ ముఖ్యం: ఫోన్‌ను బెడ్, సోఫా లేదా పిల్లోస్ మీద పెట్టి ఛార్జ్ చేయకండి. ఇవి వేడిని పట్టి ఉంచుతాయి. నేల మీద లేదా టేబుల్ మీద పెట్టి ఛార్జ్ చేయండి.

Read also-బాలయ్య బాబు ‘NBK111’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్‌గా మంచు మనోజ్..

అనవసర ఫీచర్లు ఆపేయండి

స్క్రీన్ బ్రైట్‌నెస్ ఫుల్‌గా పెట్టడం వల్ల బ్యాటరీ ఎక్కువగా ఖర్చయి ఫోన్ వేడెక్కుతుంది. కాబట్టి బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచుకోండి లేదా ‘ఆటో-బ్రైట్‌నెస్’ ఆన్ చేయండి. అలాగే మీకు అవసరం లేనప్పుడు బ్లూటూత్, జీపీఎస్, వైఫై, మొబైల్ హాట్‌స్పాట్‌లను ఆఫ్‌ చేయండి.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ 

మనం ఒక యాప్ వాడి పక్కన పెట్టినా, అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. ఇలా చాలా యాప్స్ ఒకేసారి రన్ అవ్వడం వల్ల ప్రాసెసర్‌పై భారం పడి ఫోన్ హీట్ ఎక్కుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లియర్ చేయండి. వారానికి ఒకసారైనా ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం మంచిది.

మీ ఫోన్ విపరీతంగా వేడెక్కినప్పుడు దానిని వెంటనే కాసేపు ‘స్విచ్ ఆఫ్’ చేయండి లేదా ‘ఏరోప్లేన్ మోడ్’ లో పెట్టండి. అంతేగానీ, త్వరగా చల్లారుతుందని ఫ్రిజ్‌లో పెట్టడం లేదా ఏసీ గాలికి నేరుగా ఉంచడం వంటి పనులు అస్సలు చేయకండి. దీనివల్ల ఫోన్ లోపల తేమ చేరి శాశ్వతంగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఫోన్ వేడెక్కకుండా సురక్షితంగా ఉంటుంది, అలాగే ఫోన్ లైఫ్ కూడా పెరుగుతుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×