E-Paper
Advertisement

Tanveer Ahmed: 20 ఏళ్లు వ‌చ్చేస‌రికి వైభ‌వ్ కెరీర్ నాశ‌న‌మే..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా !

Tanveer Ahmed: 20 ఏళ్లు వ‌చ్చేస‌రికి వైభ‌వ్ కెరీర్ నాశ‌న‌మే..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా !
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి రెచ్చిపోయాడు. తప్పక గెలవాల్సిన లక్నో మ్యాచ్ లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. నిన్న జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ సందర్భంగా కేవలం 38 బంతుల్లో 93 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ. ఇందులో 10 సిక్సర్లు అలాగే ఏడు బౌండరీలు ఉన్నాయి. 244 స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపాడు. అయితే వైభవ్ సూర్య వంశీ ఇరగదీసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్య వంశీ ఇరగదీస్తున్నాడు… కానీ అతని వయసు 20 ఏళ్లు వచ్చేసరికి ఇంత ఊపు ఉండదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల వయసు వచ్చే సరికి వైభవ్ సూర్యవంశీ నాశనం కావడం గ్యారెంటీ అని తెలిపారు. ఒకవేళ అలా కాకపోతే పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని శపథం చేశాడు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

20 ఏళ్లు వ‌చ్చేస‌రికి వైభ‌వ్ కెరీర్ నాశ‌న‌మే..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జైపూర్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో 220 పరుగులు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అదరగొట్టింది రాజస్థాన్. కేవలం 19.1 ఓవర్లలో మూడు వికెట్ నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. ఈ క్రమంలో వైభవ్ సూర్య వంశీ సిక్సర్లు అలాగే బౌండరీలతో చెలరేగాడు. అయితే సూర్య వంశీ బ్యాటింగ్ విధానం పై మరోసారి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్య వంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు.. కానీ ఈ పస 20 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉండదని తెలిపారు తన్వీర్ అహ్మద్. కాస్త జోరు తగ్గించుకొని వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తే బెటర్ అన్నారు. ఎలాంటి క్రికెట్ ఆడుతున్నాడో అతడికి కూడా అర్థం కాదని పరువు తీశారు. క్రీజ్ లో సెట్ కావడానికి అతడు కొంత సమయం తీసుకోవాలని సూచనలు చేశారు. లేకపోతే త్వరగా ఔట్ అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత ఆడిన బాబర్ ఆజం ముందు వైభవ్ సూర్య వంశీ పనికిరాదని పరువు తీశారు.

వైభవ్ సూర్య వంశీ ఏజ్ పై కూడా కామెంట్స్

Advertisement

వైభవ్ సూర్యవంశీ వయస్సు విషయంలో కూడా తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ కూడా తనకు అతని వయస్సు పైన అనుమానాలు ఉన్నాయన్నారు. కచ్చితంగా డిఎన్ఏ పరీక్షలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అతని వయస్సు కనీసం 22 సంవత్సరాలు ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు తన్వీర్ అహ్మద్.

 

https://www.facebook.com/photo/?fbid=122225728850289704&set=a.122097672758289704

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×