E-Paper
Advertisement

Mega 158: మెగా 158 షూటింగ్ అప్డేట్.. ఈ నెలలోనే గ్రాండ్ ఓపెనింగ్..

Mega 158: మెగా 158 షూటింగ్ అప్డేట్.. ఈ నెలలోనే గ్రాండ్ ఓపెనింగ్..
Advertisement

Mega 158: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈ ఏడాది ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కానీ నేపథ్యంలో అభిమానులలో చిన్న నిరాశ ఉండేది కానీ ఈ సినిమా సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకోవడంతో ఇదే జోష్ లో చిరు తదుపరి సినిమాపై కూడా ఫోకస్ చేశారు.

చిరంజీవి వల్లే ఆలస్యమా?

చిరంజీవి తన తదుపరి సినిమాని డైరెక్టర్ బాబీ (Bobby)దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకోబోతుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. చిరంజీవి(Chiranjeevi) ఇటీవల మోకాలి సర్జరీ చేయించుకోవడంతో ఆయనకు కాస్త విశ్రాంతి అవసరమైన నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 18వ తేదీనే పూజా కార్యక్రమాలు జరుపుకోవాల్సి ఉండగా వాయిదా పడింది.

2027 సంక్రాంతి రిలీజ్..

Advertisement

తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి నెలలో జరగబోతున్నాయని తెలుస్తుంది. ఇలా ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలను జరుపుకొని మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సంక్రాంతి హిట్ సెంటిమెంటును దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. ఇప్పటికే బాబీ చిరు కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

క్యామియో పాత్రలో మోహన్ లాల్..

Advertisement

ఇక ఈ సినిమాలో మరొక స్టార్ హీరో క్యామియో ఉండబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రలలో మలయాళ నటుడు మోహన్ లాల్ నటించబోతున్నట్టు సమాచారం. ఇక హీరోయిన్ గా ప్రియమణి కన్ఫామ్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

Also Read: Ram Charan: ఫాన్స్ అత్యుత్సాహం.. ఫైర్ అయిన చరణ్…ఇలా తయారయ్యారేంట్రా బాబు!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×