E-Paper
Advertisement

Ram Charan: ఫాన్స్ అత్యుత్సాహం.. ఫైర్ అయిన చరణ్…ఇలా తయారయ్యారేంట్రా బాబు!

Ram Charan: ఫాన్స్ అత్యుత్సాహం.. ఫైర్ అయిన చరణ్…ఇలా తయారయ్యారేంట్రా బాబు!
Advertisement

Ramcharan: సినీ నటుడు రామ్ చరణ్ (Ramcharan) సతీమణి ఉపాసన(Upasana) అపోలో హాస్పిటల్లో డెలివరీ అయిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు రెండో సంతానంలో భాగంగా కవల పిల్లలు జన్మించారు. ఒక అమ్మాయి అబ్బాయి జన్మించడంతో మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి మెగా అభిమానులు అపోలో హాస్పిటల్ కు చేరుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఇక తాజాగా రామ్ చరణ్ తన పెద్ద కుమార్తె క్లిన్ కారా(Klin Kaara)తో కలిసి అపోలో హాస్పిటల్ కు చేరుకున్నారు. ఇలా రామ్ చరణ్ హాస్పిటల్ దగ్గరకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆయనని చుట్టుముట్టారు. రామ్ చరణ్ చేతిలో తన రెండు సంవత్సరాల బిడ్డ ఉన్న విషయాన్ని కూడా గమనించకుండా అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనతో సెల్ఫీలు దిగడం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు.

అభిమానులపై చరణ్ ఆగ్రహం..

ఇలా పెద్ద సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టడంతో రామ్ చరణ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అభిమానులపై చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ ఉన్నప్పటికీ అభిమానులను అదుపు చేయడంలో సెక్యూరిటీ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అభిమానులను దాటుకుంటూ చరణ్ క్షేమంగా లోపలికి వెళ్ళిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

హద్దులు దాటిన అభిమానం..

Advertisement

ఇటీవల కాలంలో సెలెబ్రెటీల విషయంలో అభిమానులు అత్యుత్సాహం హద్దులు దాటుతోందనే చెప్పాలి. చరణ్ చేతిలో చిన్న పిల్ల ఉన్న విషయాన్ని కూడా గుర్తించకుండా అలా ఎగబడితే ఏదైనా జరగరానిది జరిగితే పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుందంటూ ఈ వీడియోలపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోలలో క్లీన్ కారా విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రాంచరణ్ ఉపాసన దంపతులకు రెండో సంతానంలో భాగంగా ముందుగా అబ్బాయి జన్మించారు అనంతరం అమ్మాయి జన్మించినట్లు అపోలో హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు.

Advertisement

ప్రస్తుతం ఉపాసనతో పాటు తన ఇద్దరు పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి మీడియాతో ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా మెగా వారసుడు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇక చిరంజీవిలాగే రామ్ చరణ్ కి కూడా ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కావటం విశేషం. మెగా వారసుడు కోసం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలా మెగా వారసుడు రావడంతో మెగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు కూడా ఉపాసన రాంచరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

Also Read; Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు మృతి!

Related News

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×