BigTV English
Advertisement

Chiranjeevi: ఓజీ రివ్యూ చెప్పేసిన చిరు.. కళ్యాణ్ బాబును అలా చూడడం..

Chiranjeevi: ఓజీ రివ్యూ చెప్పేసిన చిరు.. కళ్యాణ్ బాబును అలా చూడడం..

Chiranjeevi: అభిమాన హీరో సినిమా హిట్ కొడితే ఎలా అంటుందో ఓజీ థియేటర్స్ కు వెళ్లి చూస్తే తెలుస్తోంది. ఎన్నాళ్లవుతుందిరా ఒక సినిమాకు ఇంత హైప్ చూసి.. ఎన్నేళ్లు అవుతుందిరా పవన్ కళ్యాణ్ కు ఇలాంటి ఒక హిట్ వచ్చి.. ఇది కదరా  ఫ్యాన్స్ కు కావాల్సిన హైప్. ఒక అభిమాని.. తన అభిమాన హీరోతో సినిమా తీస్తే ఇలానే ఉంటుంది. ప్రస్తుతం ఓజీ గురించి బయట మాట్లాడుకుంటున్న మాటలు ఇవి.


పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన. చిత్రం ఓజీ. ఎన్నో ఏళ్లుగా.. వాయిదాల తరువాత ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. పవన్ యాక్షన్.. ఎలివేషన్స్, లుక్స్ ఒకటి  అని చెప్పలేం. టోటల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఓజీ.. సుజీత్ సంభవం.. థమన్ తాండవం.. పవన్ వైభవం. అంతే అంతకు మించి చెప్పడానికి మాటలు కూడా లేవు.

అసలు ఒక సినిమాను ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారు అనేది ఈ జనరేషన్ కి కొత్తగా చూపించారు పవన్ ఫ్యాన్స్. హీరోలు బెన్ ఫిట్ షోస్ కి వెళ్లి అరవడం ఏంటి.. ఒక సినిమా కోసం షూటింగ్లను క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి.. బెన్ ఫిట్ షోస్ చూసి స్టార్స్ అందరూ రివ్యూలు ఇవ్వడం ఏంటి.. ఇదంతా పవన్ కు మాత్రమే జరిగే సెలబ్రేషన్స్. మెగా హీరోలను పక్కన పెడితే.. నాని, కిరణ్ అబ్బవరం, ప్రశాంత్ నీల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది.. సోషల్ మీడియా మొత్తం ఓజీతో నిండిపోయింది.


ఇక ఈ హైప్ ను ఇంకాస్తా పెంచేశాడు మెగాస్టార్ చిరంజీవి. తమ్ముడి పూర్వ వైభవం చూసి అన్న ఆనందంతో ఉబ్బితబ్బుబైపోతున్నాడు. ఎక్కడ చూసినా ఓజీ నామస్మరణమే కావడంతో.. అందులో ఆయన కూడా యాడ్ అయి ఓజీ హిట్ అయ్యినందుకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. ఎక్స్ వేదికగా కళ్యాణ్ బాబుతో పాటు ఓజీ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.

కళ్యాణ్ బాబును అందరూ ది ఓజి – ఓజాస్ గంభీరగా చూడడం , దాన్ని సెలబ్రేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్, నిర్మాత దానయ్య మరియు ఓజీ చిత్రబృందానికి ఇంత పెద్ద సక్సెస్ ను అందుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఓజీ ముందు ముందు ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 

https://twitter.com/KChiruTweets/status/1971102596883681704

Related News

Vijay Sethupathi : నువ్వు బెడ్ మీదే పడుకుంటున్నావా? ఆండ్రియా గురించి విజయ్ సేతుపతి ఇలా అనేసారేంటి?

Rajinikanth : రజనీకాంత్ 173వ సినిమాకి అనిరుధ్ ఫిక్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Deepika Padukone: ఇండస్ట్రీలో వివక్షత ఉంది.. మళ్ళీ మొదలు పెట్టిన దీపిక!

Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది. 

Big Stories

×