OG Box Office Prediction: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓజీ ఫివర్ కనిపిస్తోంది. అమలాపురం నుంచి అమెరికా వరకు ఓజీ.. ఓజీ అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న ఓజీ బజ్ ఎలా రేంజ్ లో ఉందో నిన్న ప్రీమియర్స్తో ప్రూవ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క థియేటర్లలో నిన్న రాత్రి ఓజీ ప్రీమియర్ షోలు పడ్డాయి. మిరాయ్, లిటిల్ హార్ట్స్, వంటి చిత్రాల షోలను సైతం క్యాన్సిల్ చేసి ఓజీ ప్రీమియర్స్ వేశారంటే.. మూవీపై ఉన్న హైప్ ఎలా ఉందో అర్థమైపోతుంది. తెలుగు సినీ చరిత్రలో ఓజీ ప్రీమియర్ షోలు రికార్డు క్రియేట్ చేశాయి.
ఒక్క నిజాం ఏరియాలోనే 366కు పైగా థియేటర్లలో ఓజీ ప్రీమియర్స్ పడ్డాయి. ఇది ఆల్ టైం రికార్డుగా నిలిచింది. ఇక్క నిజాంలోనే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుంది. ఇంకా తెలుగా రాష్ట్రాల్లో ఓజీ సంచలనం ఎలా ఉందో మీకే ఊహకే తెలియాలి. దీంతో ఓజీ మూవీకి ఫస్ట్ డే ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఒపెనింగ్ కలెక్షన్స్లో ఓజీ మూవీ రికార్డు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు సినీవర్గాలు. ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే వసూళ్లతో ఓజీ సుమారు రూ. 150 నుంచి రూ. 180 కోట్ల వరకు వసూళ్లు చేసేలా కనిపిస్తోంది. ఇది కేవలం ట్రేడ్ వర్గాల అంచనాలు మాత్రమే. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వసూళ్లు అంతకు మించి ఉండేలా కనిపిస్తోంది.
ఇప్పటికే మూవీ టీం ఓవర్సిస్ వసూళ్లను వెల్లడించింది. కేవలం ప్రీమియర్స్తోనే ఈ చిత్రం నార్త్ అమెరికాలో 3 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 26 కోట్లు) వసూళ్లు చేసినట్టు మూవీ టీం ప్రకటించింది. కేవలం ప్రీమియర్స్లో ఓవర్సిస్లో ఈ రేంజ్ వసూళ్లు ఉంటే.. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపితే అక్కడ ఇంకో మిలియన్పైగా వసూళ్లు ఉ న్నట్టే. ఒక నార్త్ అమెరికాలో ఇలా ఉంటే ఓవర్సిస్ మొత్తం కలిపి.. 5 మిలియన్ల పైగా వసూళ్లు వచ్చి ఉంటాయని ట్రేండ్ పండితులు అంచన వేస్తున్నారు. మరి ఓజీ కలెక్షన్స్పై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
Also Read: Akira Nandan in OG : సర్‌ప్రైజ్.. ఓజీ మూవీలో అకీరా నందన్… ఓపెన్‌గా చెప్పేసిన థమన్
ఇక ఓజీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫ్యాన్స్ అంత సెలబ్రేషన్స్లో మునిగిపోతున్నారు. ఎక్కడ చూసిన ఓజీ సందడే కనిపిస్తోంది. థియేటర్ల ముందు అభిమానుల హంగామా మామూలుగా లేదు. థియేటర్ల ముందు, థియేటర్ల బయట ఓజీ ఓజీ అంఊట నినాదాలు చేస్తూ మూవీని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా సాహో ఫేం సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి కథానాయకుడి పాత్ర పోషించారు. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది. తమన్ సంగీతం అందించాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దాసరి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.