IND Vs AUS : ఆస్ట్రేలియా – జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్ క భారత్ ఏ జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ నియమించింది. తొలి వన్డేకు ఓ జట్టును, మిగతా 2 వన్డేలకు మరో జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 30న, అక్టోబర్ 03, అక్టోబర్ 05వ తేదీన మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే తొలి వన్డే కి కెప్టన్ గా శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రభు సిమ్రాన్, పరాగ్, బదోనీ, సూర్యాంశ్ షెడ్గె, విప్రజ్, నిశాంత్, గుర్జస్నీత్ సింగ్, యుధ్వీర్ , రవి బిష్ణోయ్,పోరెల్, ప్రియాంశ్, సిమర్జిత్ లను ప్రకటించింది బీసీసీఐ. టీమిండియా కి శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ గా ఎంపిక చేయడం పట్ల అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాతో టీమిండియా కి జరిగే టెస్ట్ సిరీస్ లో కూడా శ్రేయస్ అయ్యర్ కి ఛాన్స్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టీమిండియా ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతోంది.
Also Read : Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?
వాస్తవానికి ఆసిస్ తో తొలి వన్డేకు రజత్ పాటిదార్, రెండో వన్డేకు తిలక్ వర్మను తొలుత కెప్టెన్ గా ఎంపిక చేసింది బీసీసీఐ. కానీ తాజాగా వారిద్దరినీ తప్పించి శ్రేయస్ అయ్యర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. తొలి వన్డే కు దూరంగా ఉండనున్న.. ఆసియా కప్ 2025 ముగిసిన తరువాత తిలక్ వర్మ.. రెండు, మూడో వన్డేల్లో వైస్ కెప్టెన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనితో పాటు హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ కూడా ఈ సిరీస్ ఆడే అవకాశాలున్నాయి. మరోవైపు రజత్ పాటిదార్ ఇరానీ కప్ మ్యాచ్ లో రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కి ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగబోయే వన్డే సిరీస్ కి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. మరోవైపు వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు మాత్రం శ్రేయస్ అయ్యర్ దూరమైనట్టు బీసీసీఐ వెల్లడించింది.
గత కొంత కాలంగా శ్రేయస్ అయ్యర్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అద్భుతంగా ఆడే అతన్ని ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి, టీ-20 జట్టుకు, అలాగే వెస్టిండీస్ సిరీస్ కి కూడా ఎంపిక చేయకపోవడంతో కాస్త ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా బీసీసీఐ పై తీవ్ర స్తాయిలో విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఏ జట్టుతో స్వదేశంలో అనధికారిక టెస్ట్ సిరీస్ కు భారత్ ఏ జట్టు కెప్టెన్ గా అయ్యర్ ని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో తొలి అనధికారిక టెస్ట్ ఆడిన శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. రెండోటెస్ట్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ ని వదులుకోవడంతో పాటు.. జట్టు నుంచి తప్పుకున్నాడు. టెస్టుల్ఓల మళ్లీ పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నాడు శ్రేయాస్ అయ్యర్. మరోవైపు వెన్నునొప్పికారణంగా నాలుగు రోజుల పాటు ఫీల్డింగ్ చేయలేకపోతున్నానని బీసీసీఐ కి లేఖ రాశాడు శ్రేయస్ అయ్యర్. కొన్నాళ్ల పాటు రెడ్ బాల్ క్రికెట్ కి దూరంగా ఉండనున్నట్టు బోర్డుకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం.