E-Paper
Advertisement

Chiranjeevi: చిరంజీవి సినిమాకి ఫైనాన్స్ కష్టాలు.. 30 కోట్ల కోసం మెగాస్టార్ ని వదులుకున్న స్టార్ హీరో..!

Chiranjeevi: చిరంజీవి సినిమాకి ఫైనాన్స్ కష్టాలు.. 30 కోట్ల కోసం మెగాస్టార్ ని వదులుకున్న స్టార్ హీరో..!
Advertisement

Chiranjeevi Mega158: టాలీవుడ్‌లో ఆర్థిక ఒత్తిడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు అంటే బడ్జెట్ గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా విషయంలో ఇదే నిజం బయటపడింది.

చిరంజీవి నటిస్తున్న తదుపరి సినిమా తాత్కాలికంగా మెగా 158 అనే పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బాబీ కొల్లి.. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని KVN Productions నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక అతిథి పాత్ర (కేమియో) పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అది కథలో చాలా కీలకంగా ఉండే పాత్రగా డిజైన్ చేశారట. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్రలాగే ఇది ఉంటుందని టాక్.

Advertisement

ఈ ప్రత్యేక పాత్ర కోసం మేకర్స్ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ను సంప్రదించారు. చిరంజీవి.. మోహన్‌లాల్ ఇద్దరి మధ్య మంచి గౌరవం ఉంది. ఇప్పటివరకు ఇద్దరూ కలిసి నటించలేదు. అందుకే ఇది స్నేహపూర్వకంగా..పారితోషికం లేకుండా చేసే పాత్ర అవుతుందని మేకర్స్ అనుకున్నారు.

కానీ ఇక్కడే పేద ట్విస్ట్ వచ్చింది. ఈ కేమియో పాత్ర కోసం మోహన్‌లాల్ రూ.30 కోట్ల పారితోషికం అడిగారని సమాచారం. ఈ మొత్తం నిర్మాతలను షాక్‌కు గురి చేసింది. ఒక చిన్న అతిథి పాత్రకే ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని వెంటనే ఆ ఆలోచనను వదిలేశారట.

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి చాలా కఠినంగా ఉంది. సినిమా బడ్జెట్లు పెరిగిపోయాయి. షూటింగ్ ఖర్చులు ఎక్కువయ్యాయి. థియేటర్ల నుంచి వచ్చే వసూళ్లు కూడా అంతగా ఉండటం లేదు. ఓటీటీ, శాటిలైట్ డీల్స్ కూడా ముందులా లాభాలు ఇవ్వడం లేదు. అందుకే రూ.30 కోట్లు కేమియోకే ఇవ్వడం అసాధ్యంగా మారింది.

ఇప్పుడు మేకర్స్ అదే పాత్రకు ఒక తెలుగు స్టార్‌ను ఎంపిక చేయాలని చూస్తున్నారు. పారితోషికం లేకుండా లేదా చాలా తక్కువ మొత్తానికి ఆ పాత్ర చేయగల నటుడిని వెతుకుతున్నారట. ఈ సంఘటన టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులను స్పష్టంగా చూపిస్తోంది. స్నేహం, గౌరవం కన్నా ఇప్పుడు డబ్బే ప్రధానంగా మారిందన్నది ఈ కథ ద్వారా అర్థమవుతోంది.

ALSO READ: Dimple Hayati: ఏంటీ.. ఇండస్ట్రీ పెద్ద డింపుల్ తాతగారా.. నిజాలు బయటపెట్టిన బ్యూటీ?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×