E-Paper
Advertisement

Chiranjeevi Next Movie: అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది.. చిరంజీవికి ముందుంది పెద్ద పరీక్ష..!

Chiranjeevi Next Movie: అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది.. చిరంజీవికి ముందుంది పెద్ద పరీక్ష..!
Advertisement

Chiranjeevi Next Movie:  ప్రస్తుతం.. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా చిరంజీవి బాక్సాఫీస్ స్థాయిని నిజంగా కొలిచే చిత్రంగా మారనుందని చాలామంది భావిస్తున్నారు.

ఇటీవల విడుదలైన మన శంకరవార ప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కలెక్షన్లు కూడా అంచనాలకు మించి వచ్చాయి. కానీ ఆ సినిమా మొత్తం విజయం చిరంజీవి ఒక్కడి ఖాతాలో వేయడం సరైనది కాదనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆ చిత్రానికి పలు బలమైన కారణాలు కలిసి వచ్చాయి.

Advertisement

మొదటిగా.. ఆ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస హిట్లతో ఆయనకు హిట్ మెషిన్.. అనే పేరు వచ్చింది. ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో సహజంగానే పాజిటివ్ బజ్ ఉంటుంది. రెండవది.. సంక్రాంతి పండగ సీజన్. పండగల సమయంలో విడుదలైన.. సినిమాలకు కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వస్తారు. ఇది కలెక్షన్లపై పెద్ద ప్రభావం చూపిస్తుంది.

మూడవ ముఖ్యమైన అంశం విక్టరీ వెంకటేష్ చేసిన అతిథి పాత్ర. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి పెద్ద.. హిట్ ఇచ్చిన తర్వాత ఈ సినిమాలో కనిపించడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ఈ మూడు అంశాలు కలిసి మన శంకరవార ప్రసాద్ గారు సినిమాకు భారీ కలెక్షన్లు తీసుకొచ్చాయని చెప్పవచ్చు. దీంతో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా హిట్ అయినప్పటికీ.. చాలామంది ఈ క్రెడిట్ మొత్తం ఒకపక్క అనిల్ రావిపూడి కి, మరోపక్క వెంకటేష్ కి ఇచ్చేస్తున్నారు. చిరంజీవి ముందు సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోవడంతో.. చాలామంది ఇది చిరంజీవి మార్కెట్ అయ్యుండకపోవచ్చు అన్న వాదన కూడా చేస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంతే తప్పకుండా చిరంజీవి తన తదుపరి సినిమాతో కూడా తనకు మార్కెట్ ఉంది అని రుజువు చేసుకోవాలి.

Advertisement

అందుకే ఇప్పుడు అందరి చూపు విశ్వంభర మీదే ఉంది. ఈ సినిమాకు సంక్రాంతి సీజన్ లాంటి ఫెస్టివల్ అడ్వాంటేజ్ లేదు. అనిల్ రావిపూడి లాంటి హిట్ డైరెక్టర్ ఫ్యాక్టర్ కూడా లేదు. అలాగే పెద్ద స్టార్ క్యామియోలు కూడా కనిపించవు. ఈ కారణంగా ఈ సినిమా పూర్తిగా చిరంజీవి స్టామినాపైనే నడవాల్సి ఉంటుంది.

ఒక విధంగా చెప్పాలంటే, విశ్వంభర చిరంజీవికి నిజమైన పరీక్ష. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా నిలబడుతుందో చూస్తే, మెగాస్టార్ ఇప్పటికీ ఎంతమేర ప్రేక్షకులను ఒంటరిగా థియేటర్లకు రప్పించగలడో స్పష్టంగా తెలుస్తుంది.

అభిమానులు ఆశతో ఉన్నారు…ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా గమనిస్తోంది. చివరికి విశ్వంభర ఫలితమే చిరంజీవి ప్రస్తుత బాక్సాఫీస్ పవర్‌కు అసలైన క్లారిటీ ఇవ్వబోతోంది.

ALSO READ: Sree Leela: సైబర్ మోసాలపై శ్రీలీల కామెంట్స్.. కళ్ళు తెరిచేలోపే మొత్తం లూటీ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×